Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబుల్ ఇస్మార్ట్ చిత్రంలోని మాస్ సాంగ్ లో కె.సి.ఆర్. వాయిస్ కావాలనే పెట్టారా?

Advertiesment
KCR- Mani sharma

డీవీ

, శుక్రవారం, 26 జులై 2024 (14:26 IST)
KCR- Mani sharma
ఇటీవలే హీరో రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో మార్ ముంతా చోర్.. అనే పాటలో  కె.సి.ఆర్. వాయిస్ పెట్టడంపై టి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. కావాలని  కె.సి.ఆర్. వాయిస్ ను పెట్టారని దీనిపై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్షమాపణ చెప్పాలనీ, వివరణ ఇవ్వాలని పెద్ద రాద్దాంతమే జరిగింది. ఎట్టకేలకు శుక్రవారంనాడు దానికి వివరణ ఇస్తూ, గీత రచయిత,  సంగీత దర్శకుడు మణిశర్మ, గాయకుడు కలిసి సినిమాపై చర్చించుకుంటున్న వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
అందులో సారాంశం ఏమంటే.. మాజీ సి .ఎం. కె.సి.ఆర్..మాకూ  ఫ్యావరేట్, ఆయనను కించపర్చలేదు. సినిమాలో హీరో హీరోయిన్లు. డ్యూయెట్ సాంగ్ లో కొన్ని మీమ్స్ పెట్టాం. అందులో కె.సి.ఆర్. వాయిస్ కూడా వుంది. అది చాలా చోట్ల మీమ్స్ లో హైలైట్ అయింది. ఆ అది ఐటెం సాంగ్ కాదు. ఆ పాటలో  బొరాన్ బొరాన్.  అనే చోట ఓ మీమ్.. పెట్టినట్లే కె.సి.ఆర్. వాయిస్ కూడా పెట్టాం. ఎందుకంటే ఎంత సీరియస్ మేటర్ అయినా కొలిక్యువల్ గా కె.సి.ఆర్. చెబుతారు. ఆయన అందిరికీ ఆదర్శకం. ఆయన్ను తలచుకున్నాం. ఈ పాటలో.. దయచేసి తలచుకున్నట్లు భావించి. మీ ఫీలింగ్స్ ఏమైనా వుంటే మన్నించంవడి. మీరూ ఎంటర్ టైన్ చేయండి. అని వివరించారు. 
 
ఇదిలా వుండగా, చిత్ర దర్శకుడు పూరీపై చర్చ జరుగుతుంటే.. ఆయన మాట్లాడకుండా.. సంగీత దర్శకుడు మాట్లాడడం కూడా ఆశ్చర్యంగా వుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహుశా కె.సి.ఆర్. పాలనలో డ్రెగ్ కేసులో పూరీకూడా విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమయిందో అందరికీ తెలిసిందే గదా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుష్ దర్శకత్వంలో రూపొందిన రాయన్ చిత్రం హిట్టా ఫట్టా? రివ్యూ