Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనుష్ దర్శకత్వంలో రూపొందిన రాయన్ చిత్రం హిట్టా ఫట్టా? రివ్యూ

Advertiesment
Rayan-Danush

డీవీ

, శుక్రవారం, 26 జులై 2024 (13:26 IST)
Rayan-Danush
తమిళంలోపాటు తెలుగులో కూడా ధనుష్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఈసారి తన దర్శకుడిగా లీడ్ రోల్ చేస్తూ రాయన్ తీశాడు.  ఈ రోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'రాయన్' ధనుష్ కెరీర్‌లో 50వ సినిమాగా తెరకెక్కడం విశేషం. ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, దసరా విజయ్ వంటి నటులు ఈ సినిమాలో నటించారు.
 
కథగా చెప్పాలంటే..
తమిళనాడులోని పక్కా మాస్ ఏరియాలో ఎస్.జె.సూర్య, మరొకరు రౌడీ గ్యాంగ్ లు. చుట్టు పక్కల పోర్ట్ లో వ్యాపారం నుంచి పలు దందాలు వీరిద్దరే చేస్తుంటారు. వీరిద్దరికీ వారి తండ్రుల కాలంనుంచి వైరం వుంటుంది. అలాంటి ఏరియాలోకి ఎక్కటినుంచో చిన్నతనంలోనే ఇద్దరు సోదరులు, చెల్లెలి తీసుకుని బతుకుతెరువు కోసం రాయన్ వస్తాడు. అలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. రాయన్ (ధనుష్) సోదరుడు సందీప్ కిషన్ ఆవారా తిరుగుతూ గొడవలు పడుతుంటాడు. మరో సోదరుడు కాలేజీ చదువుతుంటాడు.
 
సాఫీగా సాగుతున్న రాయన్ కుటుంబంలో సందీప్ కిషన్ చేసిన ఓ తప్పిదం ఎస్.జె.సూర్య ప్రత్యర్థి డాన్ ను చంపేలా చేస్తుంది.  ఈ గొడవలన్నీ ఆ ఏరియాకు కొత్తగా వచ్చిన పోలీసు అధికారి ప్రకాష్ రాజ్ వచ్చాకే జరుగుతుంటాయి. ఆ తర్వాత రాయన్ ను ఎస్.జె.సూర్య తన గ్యాంగ్ లో చేరమని ఆఫర్ ఇస్తాడు. మరి రాయన్ ఆపర్ కు అంగీకరించాడా? లేదా? ఈ గ్యాంగ్ గొడవలకు పోలీసు అధికారికి సంబంధం ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ సినిమా పక్కా సిటీలోని మాస్ ఏరియాలోని కథ. మారప్పతోసహా పలు చిత్రాల కథలు ఈ తరహాలో చూసేశాం. కానీ ఇద్దరు సోదరులు, చెల్లెలును లింక్ చేస్తూ, అన్న వారి కోసం చేసిన పోరాటమే రాయన్. ఇందులో రౌడీలను  తెలివిలేని మూర్ఱులుగా పోలీస్ అధికారి తెలివిగల వారిగా చూపించే ప్రయత్నంలో రాసుకున్న కథ. ఇద్దరు రౌడీగ్యాంగ్ లతో సన్నివేశపరంగా ఢీ కొట్టడం అనేదానిలో పెద్దగా లాజిక్కు లేకపోయినా రన్నింగ్ లో కథనం బోర్ లేకుండా వుంటుంది.
 
కత్తులు, కటారులతోనే యాక్షన్ సన్నివేశాలు వుంటాయి. మెచ్చూర్డ్ యాక్షన్ సినిమా కాదు. రాయన్ పాత్ర సీరియస్ గా వుంటుంది. సందీప్ కిషన్, అపర్ణ పాత్రలు రొమాన్స్ తోపాటు కాస్త ఎంటర్టైన్మెంట్ పండిస్తాయి. మొదటి భాగమంతా రాయన్ ఏదో భాషా ఫ్లాష్ బ్యాక్ వుంటుందనేలా బిల్డప్ షాట్స్ తో దర్శకుడు జిమ్మిక్ చేశాడు.
 
ద్వితీయార్థంలో కథ నడవాలి కాబట్టి చెల్లెలు సెంటిమెంట్ తో సోదరుల కన్నింగ్ నెస్ తో కథను నడిపాడు. ఇదో కాస్త కథలోని ట్విస్ట్. రాయన్ కు పెద్ద దిక్కుగా వున్న అశోక్ పాత్ర పలు సినిమాలో నటించాడు. రాయన్ గా ధనుష్ సీరియస్ నటనే కనిపిస్తుంది. అల్లరి చిల్లరిగా బేవార్స్ పాత్ర సందీప్ చేశాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ తమిళనేటివిటీతో కూడిన వాతావరణం, వారి హావభావాలు కనిపిస్తాయి.
 
సినిమాకు రెహమాన్ సంగీతం నేపథ్యంలో సాగే బీట్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఇందులో పాటలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవు. పతాక సన్నివేశంలో వచ్చిన పాట కూడా రొటీన్ ఫార్మెట్ లో వుంది. కథ పాతదే అయినప్పటికి తెర మీద సరికొత్చూతగా పించడంలో ధనుష్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇలాంటి కథలు తమిళులకు బాగా నచ్చుతాయి. ఇందులో అందరూ కథ ప్రకారం డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తారు. గుండు చేయించుకుని ధనుష్ డీ గ్లామర్ పాత్రలో సీరియస్ గా కనిపిస్తాడు.  మెయిన్ విలన్‌గా ఎస్ జె సూర్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
 
సీరియస్ కథలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు లాజిక్ గా అనిపించవు. హీరో క్రేజ్ పట్టి నడిచిపోతుంది. ఇద్దరు ప్రత్యర్థులను ఒకరి తెలీకుండా ఒకరిని మట్టుపెట్టాలంటే పోలీసు బుర్రతో చేతికి మట్టి అంటకుండా ఎలా చేయవచ్చో చూపించాడు. తెలుగులో ఇలాంటి కథను ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి.
 రేటింగ్: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రౌండ్ 2... ప్యాంటు ఇక సరిపోదు.. రెండో బిడ్డకు తల్లి కాబోతున్న ప్రణీత!