Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్లింప్స్ తో ఎస్‌జె సూర్య కు స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన నేచురల్ స్టార్ నాని

Nani latest

డీవీ

, శనివారం, 20 జులై 2024 (16:21 IST)
Nani latest
పురానా జమానానేమే ఏక్ నరకాసుర నామ్ రాక్షస్ రహతా థా. ఓ లోగోంకో బహుత్ సతాతా థా. ఇసీ లియో శ్రీక్రిష్ణనే సత్యభామా సాత్ సే మిల్ కర్..ఉ సే.. .. అంటూ నాని, హీరోయిన్ నడుచుకుంటూ వచ్చే సీన్ ను విడుదలచేశారు. ఆ వెంటనే హ్యాపీ బర్త్ డే సార్.. అంటూ ఎస్.జె. సూర్య.. పోలీస్ గా వికటాట్టహాసం చేయడంతో ముగుస్తుంది. దీన్ని సూర్యకు విషెస్ చెపుతూ 'సరిపోదా శనివారం' నుంచి చిన్న క్లూ ఇచ్చాడు హీరో నాని. ఈ రోజు మేకర్స్ SJ సూర్య పుట్టినరోజు సందర్భంగా - నాట్ ఏ టీజర్ అనే న్యూ వీడియోని రిలీజ్ చేశారు.  
 
చెడు బలపడినప్పుడు దాన్ని అంతచేసే పవర్ పడుతుందనే ఇంట్రస్టింగ్ వాయిస్ ఓవర్ తో వీడియో ప్రారంభమైయింది. బలహీనులపై తన ఆధిపత్యాన్ని చూపించే రూత్ లెస్ కాప్ గా SJ సూర్య పరిచయమయ్యారు. ఈ కథ నుంచి శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి నరకాసురుడు (SJ సూర్య)ను ఎదుర్కోవడానికి వస్తున్నట్లుగా ప్రజెంట్ చేయడం క్యూరియాసిటీని పెంచింది.
 
టేకాఫ్ నుండి చివరి వరకు వీడియో గ్రిప్పింగ్ గా వుంది. ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య ఎపిక్ బాటిల్ గా వుండబోతోందని ప్రామిస్ చేస్తోంది. SJ సూర్య భయం పుట్టించేలా  కనిపించగా, నాని తన టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా ఉన్నారు. ఇద్దరూ తమ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు.  
 
వివేక్ ఆత్రేయ స్టొరీ టెల్లింగ్ లో యూనిక్ స్టయిల్ వున్న జీనియస్. నాట్ ఎ టీజర్ వీడియోలో తన నరేటివ్ స్టయిల్ ఆకట్టుకుంది. మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి,  జేక్స్ బిజోయ్ తన ఇంటెన్స్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్ ని మరింత ఎలివేట్ చేశారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
 
నాట్ ఎ టీజర్  వీడియో మాస్ మ్యాడ్ నెస్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. ఆగస్ట్ 29న థియేటర్లలో స్టార్ట్ అయ్యే ట్రూ గేమ్‌ను చూసేందుకు మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది.
 
ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌కు కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
 
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై అసభ్య పదజాలం: శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు