Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

రూ.50 వేలకు అమ్ముడుపోయిన రాహుల్ ద్రవిడ్ కుమారుడు... ఎలా?

Advertiesment
samit dravid

వరుణ్

, శుక్రవారం, 26 జులై 2024 (10:24 IST)
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌కు క్రికెట్ వారసుడు వచ్చాడు. ఆయన కుమారుడు ఇపుడు రూ.50 వేలకు అమ్ముడుపోయాడు. మహారాజా ట్రోఫీ కేఏసీసీఏ టీ20 టోర్నీ కోసం నిర్వహించిన వేలం పాటల్లో ద్రవిడ్ తనయుడు సమిత్‌ను రూ.50 వేలకు మైసూర్ వారియర్స్ జట్టు దక్కించుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కమ్ సీమర్‌గా సమిత్ రాణిస్తున్న విషయం తెల్సిందే. సమిత్ మంచి ప్రతిభావంతమైన క్రికెటరని మైసూరు వారియర్స్ తెలిపింది. వివిధ ఏజ్ గ్రూపుల టోర్నమెంట్లలో అతడు ఇప్పటికే సత్తా చాటాడని తెలిపింది. ఈ సీజన్‌లో కూచ్ బేహార్ ట్రోఫీ గెలిచిన అండర్-19 జట్టులో సమిత్ ఉన్నాడు. 
 
కాగా, ఇక గత సీజనులో విన్నర్‌గా విన్నర్గా నిలిచిన మైసూరు వారియర్స్ ఈసారి కూడా కరుణ్ నాయర్ నేతృత్వంలో బరిలో దిగింది. ఇటీవలి వేలంలో రూ.1 లక్షకు పేసర్ ప్రసిద్ధ కృష్ణను దక్కించుకుంది. అతడి చేరికతో టీం బౌలింగ్ లైనప్ మరింత పటిష్ఠంగా మారిందని జట్టు భావిస్తోంది. ఈ టోర్నీ కోసం నాయర్‌ను వారియర్స్ జట్టు రిటైన్ చేసుకుంది. ఇటీవలే కాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రసిద్ధ ఈ టోర్నీలో తన సత్తా చాటేందుకు ఉత్సుకతతో ఉన్నాడు.
 
మైసూరు వారియర్స్ జట్టు: కరుణ్ నాయర్, కార్తిక్ సీఏ, మనోజ్ భందగే, కార్తిక్ ఎస్.యు, సుచిత్ జే, గౌతం కే, విద్యాధర్ పాటిల్, వెంకటేశ్ ఎమ్, హర్షిల్ ధర్మానీ, గౌతమ్ మిశ్రా, ధనుశ్ గౌడ, సమిత్ ద్రావిడ్, దీపక్ దేవడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాత్సవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ కృష్ణ, ముహమ్మద్ సర్ఫరాజ్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమ నమ్మకాన్ని భారత అథ్లెట్లు వమ్ము చేయరు : గగన్ నారంగ్