Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కో-ఛైర్‌పర్సన్‌‌గా నియమితులైన బన్సీధర్ బండి

Bansidhar Bandi

ఐవీఆర్

, బుధవారం, 24 జులై 2024 (22:31 IST)
స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్, వైస్ ప్రెసిడెంట్, శ్రీ బన్సీధర్ బండి, 2024-25 సంవత్సరానికి గానూ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కో-ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన అసోచామ్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సంయుక్త సమావేశంలో ఈ నియామకం వెల్లడించారు.
 
శ్రీ బండికి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్‌పర్సన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సీఎండీ శ్రీ కటారు రవి కుమార్ రెడ్డి, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కో-చైర్ పర్సన్ & CtrlS డేటాసెంటర్స్ వ్యవస్థాపక-సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి స్వాగతం పలికారు. శ్రీ బండి తన నియామకం గురించి మాట్లాడుతూ, “ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా నియమించబడడం గౌరవంగా భావిస్తున్నాను. నేను నా తోటి కౌన్సిల్ సభ్యులు, పరిశ్రమ సహచరులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని అన్నారు. 
 
ఉక్కు, ఇంధనం, సహజ వనరులు, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ వంటి రంగాలలో ప్రభుత్వం (నీతి ఆయోగ్) అలాగే ప్రైవేట్ రంగం రెండింటితోనూ కలిసి పనిచేసిన విస్తృతమైన అనుభవం శ్రీ బండికి ఉంది. ఉక్కు, మెరైన్ & ఆక్వా సెక్టార్, ఎంఎస్ఎంఈ, హాస్పిటాలిటీ & టూరిజం, అగ్రి&ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రభుత్వంతో భాగస్వామ్యం చేయడం ద్వారా, రాష్ట్రంలోని ఈ రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులతో పరస్పర సహకారం అందించడం ద్వారా మరింతగా ఈ రంగాలకు చేయూత అందించాలని అసోచామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ లక్ష్యంగా పెట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమాల పుట్ట తవ్వుతున్న కూటమి ప్రభుత్వం: వైసిపి నుంచి భాజపాకి వలసలు?