Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో బాలికపై ఐదుగురు కామాంధుల అఘాయిత్యం!

victim girl
వరుణ్
మంగళవారం, 25 జూన్ 2024 (13:06 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఐదుగురు కామాంధులు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నగరంలోని నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల కథనం మేరకు... కాచిగూడకు చెందిన బాలికను ఐదుగురు యువకులు లోబరుచుకున్నారు. ఆ తర్వాత ఆ బాలికకు గంజాయి అలవాటు చేయించి, నేరేడ్‌మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, అక్కడ నుంచి పారిపోయారు. 
 
అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బాలిక.. తేరుకుని ఇంటికి వచ్చి, జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ అఘాయిత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సివుంది. 

స్పాప్‌చాట్ డౌన్‌లోడ్‌కు అంగీకరించని తండ్రి... ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న బాలిక!! 
 
మొబైల్ ఫోనులో స్నాప్‌చాట్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కన్నతండ్రి అంగీకరించలేదు. దీంతో ఆ బాలిక ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... మహారాష్ట్రలోని థానేలోని డోంబివిలీ ప్రాంతానికి చెందిన బాలిక శుక్రవారం స్నాప్‌చాట్‌ను మొబైల్ ఫోనులో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీన్ని గుర్తించిన తండ్రి... అందుకు నిరాకరించారు. 
 
యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ బాలిక.. ఆ రాత్రికే తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments