Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యధావిధిగా జన్మభూమి - సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు...

Advertiesment
train

వరుణ్

, మంగళవారం, 25 జూన్ 2024 (08:28 IST)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు నుంచి 11 వరకు నిలిపివేసింది. ఇంజనీరింగ్, పట్టాల పటిష్టం, ఇతర మరమ్మతులు కారణంగా ఈ రైళ్ళను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. అయితే, ఈ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయాలనే నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే వెనక్కు తగ్గింది. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు తొలుత ప్రకటించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
దీంతో ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు నిలిపివేయాలనుకున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను యధావిధిగా నడపనున్నారు. ఈ నెల 26 నుంచి విశాఖ - లింగంపల్లి(12805), 27 నుంచి లింగంపల్లి - విశాఖ(12806) జన్మభూమి ఎక్స్‌‌ప్రెస్‌ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ మేరకు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా 25వ తేదీ (మంగళవారం) నుంచి చంగల్‌పట్టు - కాకినాడ పోర్టు(17643), 26 నుంచి కాకినాడ పోర్టు - చంగల్‌పట్టు(17644) సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లు సైతం యధావిధిగా నడవనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వర్షానికే అయోధ్య గర్భగుడిలోకి నీరు... మందిరం పైకప్పు లీకేజీ!!