Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సుపై డాక్టర్ అత్యాచార యత్నం: బ్లేడుతో డాక్టర్ జననాంగం కోసేసింది

ఐవీఆర్
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (11:59 IST)
నర్సుపై వైద్యుడు అత్యాచారం చేయబోయాడు. తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని ఎదుర్కొనే క్రమంలో బాధితురాలు పదునైన బ్లేడుతో ఆ వైద్యుడు జననంగాన్ని కోసేసింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపుర్ జిల్లాలోని ఆర్బిఎస్ ఆరోగ్య కేంద్రంలో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. వైద్య కేంద్రంలో విధుల్లో వున్న నర్సుపై బుధవారం రాత్రి ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్, వైద్యుడు సంజయ్ పూటుగా మద్యం సేవించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నర్సు వద్దకు వచ్చాడు. అనంతరంపై ఆమెపై సామూహిక అత్యాచారం చేసేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. దీనితో ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు వెంటనే శస్త్రచికిత్సలు చేసే పదునైన బ్లేడును తీసుకుని వైద్యుడి జననంగాన్ని కోసేసింది.
 
ఈ హఠత్పరిణామంతో అందరూ బెంబేలెత్తిపోయారు. దాంతో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన వైద్యుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా తనపై జరుగుతున్న దారుణాన్ని ఎదుర్కొని గుణపాఠం చెప్పిన బాధితురాలిని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం