Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రేసియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యం, నర్సరీ యజమానులకు ప్రయోజనం

crop

ఐవీఆర్

, శుక్రవారం, 23 ఆగస్టు 2024 (19:27 IST)
దేశం యొక్క మొత్తం సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో 42%తో మిరప పంటలు దేశ ఆర్థిక వ్యవస్థలో, రైతుల అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయినప్పటికీ, విజయవంతమైన మిరప సాగు యొక్క పునాది ఆరోగ్యకరమైన మొలకల మీద ఆధారపడి ఉంటుంది, ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్పిడికి దారితీస్తుంది. “మిరప పరిశ్రమలో, విజయం అనేది నారు నాణ్యతతో ప్రారంభమవుతుంది. గ్రేషియాతో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యంగా ఉంటాయి, నర్సరీ యజమానులకు మరింత వ్యాపారం జరిగేందుకు ఇది తోడ్పడుతుంది. ఎందుకంటే రైతులు వారి నుండి కొనుగోలు చేస్తారు” అని గోద్రెజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సిఇఒ రాజవేలు ఎన్‌కె అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ, “గోద్రెజ్ ఆగ్రోవెట్ యొక్క గ్రేసియా ఆరోగ్యకరమైన నారు పెంపకంలో చురుకైన విధానాన్ని అందిస్తుంది. సరైన సమయంలో, సరైన పరిమాణంలో గ్రేసియాను వినియోగించటం ద్వారా, నర్సరీ యజమానులు ప్రధాన పొలాల్లో మెరుగైన నాట్ల కోసం ఆరోగ్యకరమైన, తెగులు లేని నారును నిర్ధారించవచ్చు. అందువల్ల నర్సరీ యజమానుల సంపద కోసం, ఆరోగ్యంగా ప్రారంభించండి, స్మార్ట్‌గా ప్రారంభించండి, గ్రేసియాతో ప్రారంభించమని మేము సలహా ఇస్తున్నాము" అని అన్నారు. 
 
గ్రేసియా యొక్క ప్రత్యేకమైన ట్రాన్స్‌లామినార్ చర్య, మిరప పంటలకు రెండు ప్రధాన ముప్పులు అయిన తామర పురుగు, గొంగళి పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఇది నర్సరీ యజమానులు, రైతులు ఇద్దరికీ అత్యుత్తమ శ్రేణి ఎంపికగా నిలుస్తుంది. సరైన సమయంలో చురుకుగా దీనిని వినియోగించటం ద్వారా, తెగుళ్లను నియంత్రించడంలో అధిక సమయం పాటు గ్రేసియా ప్రభావాన్ని అందిస్తుంది, అనూహ్య వాతావరణ పరిస్థితులలో ఇది మెరుగైన రక్షణ అందిస్తుంది. ఇది తెగుళ్లు, పర్యావరణ ఒత్తిళ్లకు మరింత నిరోధకతను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన నారును అందిస్తుంది, విజయవంతమైన పంటకు వేదికను ఏర్పాటు చేస్తుంది. ఈ దృఢమైన నారు, మార్పిడి తర్వాత మెరుగ్గా స్థిరపడతాయి, మిరప పంటకు కీలకమైన ప్రారంభాన్ని ఇస్తుంది.
 
గ్రేసియా వంటి ఉత్పత్తులతో విత్తనాల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు, లాభదాయకతను సాధించడానికి గోద్రేజ్ ఆగ్రోవెట్ నర్సరీ యజమానులు, రైతులు ఇద్దరికీ అవకాశం కల్పిస్తోంది. అధునాతన నారు పరిష్కారాలతో మిరప విత్తే సీజన్‌ను ప్రారంభించడం ద్వారా, నర్సరీ యజమానులు తమ నారును తొలి దశల నుండి రక్షించేలా చూసుకోవచ్చు, పంట నాణ్యతను మెరుగుపరుస్తుంది, తరువాత దిద్దుబాటు చర్యల అవసరాన్ని తగ్గించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాస్‌కు దైవబలం పుష్కలం ... బండి సంజయ్, కిషన్ రెడ్డి