Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్టీసీ బస్సులో పురిటినొప్పులు - డెలివరీ చేసిన కండక్టర్

Advertiesment
woman delivery

ఠాగూర్

, మంగళవారం, 20 ఆగస్టు 2024 (12:12 IST)
రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
 
గద్వాల డిపోనకు చెందిన గద్వాల - వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. 
 
వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.
 
రక్షాబంధన్‌ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి #TGSRTC యాజమాన్యం తరపున అభినందనలు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయమంటూ కితాబిస్తున్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

India Post GDS Results-ఏపీకి 1,355, తెలంగాణలో 981 పోస్టులు