టీనేజీ అమ్మాయిపై వృద్ధుడి అత్యాచారం... కొడుకు అమర్చిన సీక్రెట్ చిక్కిన వైనం...

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2023 (09:14 IST)
ఢిల్లీలో ఓ టీనేజీ అమ్మాయిపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ బాధితురాలు పొరుగింటి యువతే. గత కొంతకాలంగా ఆ యువతిపై కన్నేసిన 68 యేళ్ల వృద్ధుడు... ఆ యువతిని మాయమాటలతో మభ్యపెట్టి లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే, తన ఇంట్లోనే కొడుకు అమర్చిన సీసీటీవీ కెమెరాకు చిక్కాడు. వీడియోను బాధిత బాలిక తండ్రికి కుమారుడు పంపాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 68 యేళ్ల వృద్ధుడు, బాధిత బాలిక పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. వృద్ధుడు తరచుగా బాలిక ఇంటికి వచ్చేవాడు. ఇరు కుటుంబాలు కలిసి అపుడపుడూ ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతుండేవాడు. ఒక రోజు తన ఇంటి వెలుపలు ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించిన వృద్ధుడు ఆమెను మభ్యపెట్టి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
అయితే, ఈ అత్యాచార ఘటన ఓ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయింది. ఈ కెమెరాను నిందితుడి కుమారుడే అమర్చాడు. వృద్ధుడికి 40 యేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ తండ్రి తీరు నచ్చకపోవడంతో ఇరువురి మధ్య మాటల్లేవు. తమపై క్షుద్రపూజలు చేస్తున్నాడేమోనని అనుమానించిన ఆ కుమారుడు.. తండ్రికి చెందిన గదిలో రహస్యంగా కెమెరా అమర్చాడు. 
 
ఇపుడా కెమెరాలోనే రేప్ ఘటన నమోదైంది. అయితే, మఈ రేప్ వీడియో బాధిత బాలిక తండ్రికి చేరడంతో కుమార్తెనులదీశాడు. దీంతో ఆ బాలిక జరిగిందంతా వివరించింది. వృద్ధుడు చేసిన పాడుపనికి తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. వృద్ధుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం