Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్, డ్రాయర్లతో అపార్టుమెంటులోకి దూరి..?

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (14:55 IST)
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో రోజురోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇంటికి తాళం వేసి వెళితే తిరిగొచ్చేసరికి ఇంట్లోని విలువైన వస్తువులు ఉంటాయో లేదోనన్నది అనుమానమే. అంతేకాదు ఇంట్లో ఉన్నా కూడా దొంగలు చాకచక్యంగా దూరి దొంగతనానికి పాల్పడుతున్నారు
 
అలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున విద్యానగర్ లోని ఒక అపార్టుమెంటులో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సిసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. నిన్న రాత్రి తమ అపార్టుమెంట్లో దొంగతనం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు.
 
అయితే తలుపులు వేసినా ఓ బ్యాంకు ఉద్యోగి ఇంట్లోకి దూరిన దొంగలు 30 గ్రాముల బంగారం, 25 వేల రూపాయల వెండి, 5 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్ళారు. అక్కడున్న సి.సి.టివి ఫుటేజ్ లను పరిశీలించారు. నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అపార్టుమెంట్, ఇంటికి తాళాలు వేసినా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
 
రాత్రి సమయాల్లో పోలీసు నిఘా మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కనబడుతోంది. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నారన్న విషయం ఇప్పుడు నగర ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకునే పనిలో పడ్డారు  పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"కంగువ" ప్రీ బుకింగ్స్.. అమెరికాలో అదుర్స్.. మేకర్స్ హ్యాపీ

తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు.. అరెస్టు తప్పదా?

ఏడు నగరాల్లో ప్రమోషన్స్-పుష్ప 2 బాధ్యతలు బన్నీకే.. సుక్కూ బిజీ

సక్సెస్ కోసం నాగార్జున ఎమోషనల్ ఎదురుచూపు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments