ప్రియురాలి కోసం భార్యను చంపిన భర్త... ఆపై దొంగలు చంపేశారంటూ...

ఠాగూర్
ఆదివారం, 17 ఆగస్టు 2025 (11:57 IST)
తన ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను ఓ కిరాతక భర్త హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పడింది భారతీయ జనతా పార్టీకి చెందిన నేత కావడం గమనార్హం. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అజ్మీర్‌కు చెందిన బీజేపీ నేత రోహిత్ సైనికి సంజు అనే మహిళతో కొంతకాలం క్రితం వివాహమైంది. అయితే, అదే ప్రాంతానికి చెందిన రీతూ సైనీ అనే మహిళతో కూడా ఆయన వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమ బంధానికి భార్య సంజు అడ్డుగా ఉందని భావించాడు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 10వ తేదీన సుంజు ఇంటిలోనే అనుమానాస్పదస్థితిలో చనిపోయి కనిపించింది. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా రోహిత్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇంట్లో దోపిడీకి వచ్చిన దొంగలు... తన భార్యను హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్టు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అతని ప్రవర్తనను అనుమానించిన పోలీసులు... రోహిత్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా అసలు నేరాన్ని అంగీకరించాడు. 
 
అతనివద్ద జరిపిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియురాలు రీతూ ప్రోద్బలంతోనే రోహిత్ తన భార్యను హత్య చేసినట్టు అంగీకరించాడు. తమ మధ్య నుంచి సంజు అడ్డు తొలగించుకోవాలని రీతూ ఒత్తిడి చేయడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపాడు. ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. ఈ కేసులో రోహిత్‌తో పాటు ఆయన ప్రియురాలు రీతూ సైనీని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments