ప్రాణ స్నేహితుడి భార్యపై అత్యాచార యత్నం, ప్రతిఘటించడంతో...

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (21:16 IST)
వారిద్దరు ప్రాణ స్నేహితులు. పెళ్ళిళ్ళు ఇద్దరూ ఒకేసారి చేసుకున్నారు. ఒకరంటే మరొకరికి అమితమైన ఇష్టం. దీంతో వారు ఎలాంటి స్నేహితులో పెళ్ళి చేసుకున్న సతీమణులకు అర్థమైంది. వారి ఇంటికి వీరు, వీరి ఇంటికి వారు వచ్చి వెళ్ళడం మామూలుగా మారింది. అయితే స్నేహితుడి భార్య బాగా అందంగా ఉండటంతో కన్నేసి స్నేహానికే మచ్చ తెచ్చాడు.

 
ముంబైలోని థానే ప్రాంతంలో సుప్రియ, కిషోర్ షిండేలు నివాసముంటున్నారు. కిషోర్ ప్రాణ స్నేహితుడు విశాల్. ఇంటర్మీడియట్ నుంచి వీరు ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసే చదువుకోవడం.. ఒకే కంపెనీలో చేరి ఒకేసారి పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.

 
పెళ్ళయిన తరువాత విశాల్ లోని అసలు స్వరూపం బయటపడింది. మొదట్లో స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన విశాల్ ఆ తరువాత అతని భార్యతో పరిచయం పెంచుకునేందుకు అవసరమైనవన్నీ చేసాడు. కిషోర్ బయటకు వెళ్ళాడని తెలుసుకుని మరీ వచ్చేవాడు.

 
విశాల్ బుద్ధిని త్వరగా తెలుసుకుంది సుప్రియ. ఇలా చేయడం తప్పని చెప్పింది. నీపై ఎంతో నమ్మకాన్ని నా భర్త పెట్టుకున్నాడు. నేను ఆయనకు ఈ విషయాన్ని చెప్పను. నీవెన్ని వెర్రి చేష్టలు చేసినా నేను చెప్పనంటూ విశాల్‌కే చెప్పింది. 

 
అంతే విశాల్ ఇంకా రెచ్చిపోయాడు. ఒంటరిగా ఉన్న సుప్రియపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ప్రతిఘటించిన ఆమె చెంప ఛెళ్లుమనిపించింది. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన విశాల్ ఆమెను చున్నీతో మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసాడు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నదని నమ్మించేందుకు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసి వెళ్ళిపోయాడు.

 
ఇంటికి వచ్చిన కిషోర్ తన భార్య ఆత్మహత్య చేసుకున్నదని ముందుగా భావించాడు. పోలీసులకు సమాచారమిచ్చాడు. కానీ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు తన భార్య అని నిర్థారించుకున్నాడు. పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది. తన స్నేహితుడే హత్య చేశాడని కుమిలిపోయాడు కిషోర్. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments