Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజు రాత్రి మాతో గడిపి నీ భర్తను తీసుకెళ్లు... లేదంటే ఖబడ్దార్...

Advertiesment
ఈ రోజు రాత్రి మాతో గడిపి నీ భర్తను తీసుకెళ్లు... లేదంటే ఖబడ్దార్...
, సోమవారం, 17 జనవరి 2022 (17:02 IST)
కామాంధులు రకరకాల మార్గాల్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళ భర్తను కిడ్నాప్ చేసి, తమతో రాత్రంతా గడిపితే భర్తను వదిలేస్తామంటూ ఓ వివాహితను బెదిరించారు కామాంధులు. భర్తను అప్పగించి కోర్కె తీర్చుకోండి అని చెప్పి ఆమె భర్త కోసం పరుగు పరుగున వెళ్లింది... చివరికి ఏమైంది?

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బలో ఓ వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రఘు, తిరుపతి, నాగరాజు అతడి భార్యపై కన్నేసారు. ఎలాగైనా ఆమెను లైంగికంగా అనుభవించాలని పన్నాగం పన్నారు. ఈ క్రమంలో ఆమె భర్తను కారులో ఎక్కించుకుని పూటుగా కల్లు తాగించారు. అతడు అపస్మారకంలోకి వెళ్లగానే కారులో పడేసి అతడి భార్యకు ఫోన్ చేసారు.

 
తమ కోర్కె తీర్చాలనీ, లేదంటే నీ భర్తను చంపేస్తామని బెదిరించారు. దానితో ఆమె భయపడిపోయింది. తన భర్తను ఏమీ చేయవద్దనీ, అతడిని తనకు అప్పగించి మీరు కోరినట్లే తీర్చుకోండి అని చెప్పింది. మరోవైపు తన భర్తను కిడ్నాప్ చేసి తనపై అఘాయిత్యం చేస్తామని ముగ్గురు వ్యక్తులు తనను బెదిరిస్తున్నట్లు బంధువులకు సమాచారం ఇచ్చింది మహిళ. ఈలోపు కామాంధులు రమ్మన్న చోటికి వెళ్లింది మహిళ.

 
అక్కడ తన భర్త అపస్మారక స్థితిలో వుండటాన్ని చూసి ఆయన్ను వదిలేయాలంటూ బ్రతిమాలింది. అవేమీ పట్టించుకోని ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారితో ఆమె పెనుగులాడుతుండగా అక్కడికి మహిళ తరపు బంధువులు వచ్చారు. దీనితో అక్కడి నుంచి కామాంధులు ముగ్గురూ పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడప రిమ్స్‌లో 70 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్