Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదర్ గూడ ఇష్తా సిటీ అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం

Advertiesment
హైదర్ గూడ ఇష్తా సిటీ అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం
, ఆదివారం, 16 జనవరి 2022 (12:54 IST)
హైదరాబాద్ నగరంలోని హైదర్‌గూడ ఇష్తా సిటీ బహుళ అంతస్తు భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అపార్ట్‌మెంట్‌లోని 521 నంబరు ఉన్న ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు క్షణాల్లో ఇతర ఫ్లాట్లకు కూడా వ్యాపించాయి. 
 
ఈ మంటలను చూసిన ఆ అపార్టుమెంట్ వాసులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. 
 
అయితే, ఈ అగ్నిప్రమాదం వల్ల ఫ్లాట్లలోని సామాగ్రి అంతా పూర్తిగా దగ్ధమైపోయినట్టు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు.. నీట మునిగిన గ్రామాలు