కరోనా గురించి, ఇటీవల వర్మ సినిమా సమస్యలపై స్పందించడం గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు పెదివి విప్పారు.
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో బాగా భయపడిపోయాం. థర్డ్ వేవ్ లో అంత ప్రమాదం లేదు అని చెబుతున్నారు. ఓమిక్రాన్ అనేది అంత ఇబ్బంది పెట్టడం లేదు. ప్రజల్లో భయాలు ఉండటం సహజం. వ్యాక్సిన్ తో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోండి. థమన్, యూవీ వంశీకి రెండు మూడు రోజుల్లో తగ్గిపోయింది.
- చిరంజీవి గారికి ఇండస్ట్రీ విషయాలపై అవగాహన ఉంది. ఆయన సీఎం గారితో మీట్ అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. త్వరలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.. తొందరపడి మాట్లాడొద్దని గతంలోనే మేమంతా చెప్పాం. గొడవలు పడితే సమస్య తీరదు. అది మరింత తీవ్రతరం అవుతుంది. సహనంగా ఉండాలని కోరాం. కానీ ఎవరూ వినలేదు. ఫైనల్‌గా ఎ,.పి. ప్రభుత్వంలో పరిస్థితులు సినిమా పరిశ్రమకు అనుకూలంగా వున్నాయని తెలిపారు.