Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి కోసం కొలంబియా వెళ్లిన ఆంధ్రా కుర్రోడు.. అనుమానాస్పద మృతి

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (09:54 IST)
ప్రియురాలి కోసం కొలంబియా వెళ్లి ఆంధ్రా కుర్రోడు ఒకడు శవమైతేలాడు. ఈ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బేతపూడి సుధీర్ కుమార్ (జోషి) ప్రభుత్వ ఉపకార వేతనంతో స్పెయిన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇటీవలే ఇంటికి చ్చాడు.
 
అయితే, సుధీర్ కుమార్ గతంలో కొలంబియా జాతీయురాలు జెస్సికాతో సహజీవనంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో, స్పెయిన్ వెళుతున్నానంటూ జి.కొండూరు నుంచి బయల్దేరిన సుధీర్ కొలంబియా వెళ్లినట్టు తెలిసింది. పుట్టినరోజు నేపథ్యంలో తన ప్రేయసి జెస్సికాను సర్‌ప్రైజ్ చేద్దామని కొలంబియా వెళుతున్నానని సుధీర్ తన సోదరి జ్యోత్స్నకు తెలిపాడు.
 
అయితే, ఐదు రోజుల కిందట జెస్సికా... జ్యోత్స్నకు ఫోన్ చేసి సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అంతేకాదు, చనిపోయే ముందు సుధీర్... భారత్‌లోని తన సోదరుడితో మాట్లాడిన వీడియో కాల్ క్లిప్పింగ్‌ను కూడా జ్యోత్స్నకు పంపించింది.
 
కాగా, సుధీర్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడికి, జెస్సికాతో స్పర్థలు ఉన్నాయని సోదరి జ్యోత్స్న చెబుతోంది. తమ ఆర్థికస్థితి అంతంతమాత్రమేనని, సుధీర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు సాయపడాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments