Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రమత్తును వీడని విక్రమ్ ల్యాండర్ - ప్రజ్ఞాన్ రోవర్

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (09:31 IST)
చంద్రమండలం దక్షిణ ధృవం అధ్యయనం కోసం వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. చంద్రుడిపై పొద్దుపొడిచి మూడు రోజులు అయినప్పటికీ ల్యాండర్, రోవర్‌ల నుంచి ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదు. అయితే, వీటిని నిద్రలేపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. అయినప్పటికీ విశ్రమించేది లేదనీ.. అక్కడ వెలుతురు ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటామని ఇస్రో తెలిపింది. పైగా, అవి ఎపుడైనా నిద్ర మేల్కొనవచ్చన ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, చంద్రుడిపై పొద్దుపొడిచి మూడు రోజులు దాటినా చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదని, అయితే, సూర్యరశ్మి ల్యాండర్, రోవర్‌పై ఉన్నంతకాలం అవి ఎప్పుడైనా మళ్లీ క్రియాశీలకం కావచ్చని తెలిపారు.
 
'ఇప్పటివరకూ ఎటువంటి సిగ్నల్ రాలేదు. అలా అని సిగ్నల్ ఇక ఎప్పటికీ రాదని కూడా చెప్పలేం. మరో 14 రోజుల పాటు వేచి చూద్దాం. ఈ సమయంలో ల్యాండర్, రోవర్‌రై సూర్యరశ్మి పడుతూనే ఉంటుంది. కాబట్టి, వాటి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. అంటే చివరి రోజున కూడా అవి క్రియాశీలకం కావచ్చు. తదుపరి ఏం జరుగుందో చెప్పడం అసాధ్యం' అని ఆయన పేర్కొన్నారు.
 
చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ మరోసారి క్రియాశీలకం అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ తెలిపారు. మునుపు జరిపిన పరీక్షలను మరో ప్రాంతంలో నిర్వహించి చంద్రుడి గురించి మరింత ఖచ్చితమైన సమాచారం సేకరించవచ్చని అన్నారు. అయితే, ల్యాండర్, రోవర్ మళ్లీ మేల్కొంటాయా? లేదా? అన్న విషయం అటుంచితే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela in 2025: గుంటూరు కారం తర్వాత బ్రేక్.. మళ్లీ కొత్త ప్రాజెక్టులతో శ్రీలీల బిజీ బిజీ

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments