మాజీ భార్య ప్రియుడిని హత్య చేసిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
గురువారం, 29 ఆగస్టు 2024 (09:58 IST)
బెంగుళూరు నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన మాజీ భార్య ప్రియుడిని కిరాతకంగా హత్య చేశాడు. ఎయిర్ పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి కోసం చాలా సేపు ఎదురుచూసిన నిందితుడు... అతడు బయటకు వచ్చిన వెంటనే పదునైన కత్తితో గొంతు కోశాడు. దీంతో ఎయిర్ పోర్టు ఉద్యోగి మృతి చెందాడు. 
 
నిందితుడు పదునైన కత్తిని దాచిపెట్టి.. బస్సులో విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్నాక హత్య చేయాలనుకున్న వ్యక్తి బయటకు వచ్చే వరకు వేచి చూశాడు. తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. కాగా హత్య అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
కాగా హత్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతదేహం రక్తంతో తడిసిపోవడం వీడియోలో కనిపించింది. నిందిత వ్యక్తి, అతడి మాజీ భార్య 2022లో విడిపోయారు. హత్యకు గురైన వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానమే వీరిద్దరి మధ్య గొడవలకు దారితీసింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. మాజీ భార్య ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తి కెంపేగౌడ ఎయిర్ పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడిని చంపేందుకు నిందితుడు గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments