యువత సాధికారత పట్ల తన నిబద్ధతకు అనుగుణంగా, భారతదేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి), ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో సేల్స్, మార్కెటింగ్‌లో యువ ప్రతిభావంతులు 5,000 మందికి సాధికారత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి)తో ఈరోజు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ అవగాహన ఒప్పందం ద్వారా అధికారికంగా రూపొందించబడిన భాగస్వామ్యంతో విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, చిత్తూరులో ఔత్సాహిక నిపుణులకు సమగ్ర శిక్షణ, అభివృద్ధి అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డిజిటల్ మార్కెటింగ్, ప్రోడక్ట్ నాలెడ్జ్, సేల్స్ టెక్నిక్స్, మార్కెట్ రీసెర్చ్, ఎనాలిసిస్, సేల్స్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనల్ బ్రాండింగ్, ప్రొఫెషనల్ గైడెన్స్ డెవలప్‌మెంట్, కేరీర్ గైడెన్స్ సహా సేల్స్, మార్కెటింగ్‌లోని వివిధ అంశాలను కవర్ చేసే సమగ్ర పాఠ్యాంశాలను ప్రోగ్రామ్ కలిగి ఉంటుంది. పోటీ జాబ్ మార్కెట్‌లో ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం కలిగిన యువకుల కోసం ఇది రూపొందించబడింది.
శ్రీ హిమాన్షు ప్రియదర్శి, చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ మాట్లాడుతూ, “భారతదేశానికి గ్రోత్ కారిడార్‌గా ఆంధ్రప్రదేశ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడం కొనసాగిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, రాష్ట్ర యువత పై పెట్టుబడులు పెట్టడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంపొందించడానికి, దాని ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడంలో సహాయపడటానికి ఎపిఎస్‌ఎస్‌డిసితో చేతులు కలపడానికి మేము సంతోషిస్తున్నాము. తరువాతి తరం నిపుణులకు సాధికారత కల్పించడం వల్ల రాష్ట్రం యొక్క మొత్తం పురోగమనానికి గణనీయంగా దోహదపడుతుందని, భారతదేశ వృద్ధి కథలో దాని పాత్రను పునరుద్ఘాటిస్తుందని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.
"హెచ్‌సిసిబితో ఈ భాగస్వామ్యం యువకులను విజయవంతం చేయడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయాలనే మా భాగస్వామ్య లక్ష్యంకు నిదర్శనం. ఈ కార్యక్రమం కొత్త తరం నిపుణులను శక్తివంతం చేస్తుందని మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై శాశ్వత సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని ఎపిఎస్‌ఎస్‌డిసి మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ జి గణేష్ కుమార్ (ఐఏఎస్) అన్నారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ యువతకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించే దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడంలో హెచ్‌సిసిబి యొక్క కొనసాగుతున్న నిబద్ధతకు ఉదాహరణగా నిలుస్తుంది.