Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐటిఐ, పాలిటెక్నిక్ విద్యార్థులలో 403 మందికి ఉపాధి అవకాశాలను అందించిన హ్యుందాయ్

Advertiesment
image

ఐవీఆర్

, సోమవారం, 29 జులై 2024 (22:45 IST)
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్), దేశవ్యాప్తంగా తొమ్మిది భారతీయ రాష్ట్రాల్లోని తమ డీలర్ నెట్‌వర్క్‌లో ఐటిఐలు, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి 403 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను అందించినట్లు ప్రకటించింది. ఐటిఐలు, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని హెచ్ఎంఐఎల్ నిర్వహించటంతో పాటుగా దాని విస్తృత శ్రేణి నెట్‌వర్క్ డీలర్‌ల వద్ద అర్థవంతమైన ఉపాధి అవకాశాలను పొందడానికి విద్యార్థులకు మరింతగా సహాయం చేస్తుంది. ఇటీవలి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో నిర్వహించారు.
 
‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ అనే హ్యుందాయ్ యొక్క అంతర్జాతీయ లక్ష్యంకు కట్టుబడి, హెచ్ఎంఐఎల్ జీవితాలను సుసంపన్నం చేయడం, భారతదేశ యువత కలలను సాకారం చేయడం, మెరుగైన భారత్‌ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా, హెచ్ఎంఐఎల్ విద్యార్థులకు పరిశ్రమ-సన్నద్ధమైన నైపుణ్యాభివృద్ధి, తాజా సాంకేతికతల పట్ల అవగాహనను కల్పించటం, ఉద్యోగ శిక్షణ, కోర్సు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలను నిర్ధారించడానికి ఒక పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది.
 
గ్రాడ్యుయేషన్ డే వేడుకపై హెచ్ఎంఐఎల్ హోల్-టైమ్ డైరెక్టర్, సీఓఓ- శ్రీ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “హెచ్ఎంఐఎల్ భారతదేశానికి కట్టుబడి ఉంది. భారత ప్రభుత్వం యొక్క ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమంకు మద్దతు ఇస్తుండటం పట్ల మేము గర్విస్తున్నాము. ఇటీవలి ప్రోగ్రామ్ విద్యార్థులు సరికొత్త సాంకేతికతలలో శిక్షణ పొందారని, వారు తమ ఉద్యోగంలో మొదటి రోజు నుండి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారిస్తుంది.  దేశవ్యాప్తంగా మరింత ఎక్కువమంది యువతకు శిక్షణ ఇవ్వాలని హెచ్ఎంఐఎల్ యోచిస్తోంది, తద్వారా వారికి గౌరవప్రదమైన జీవనోపాధిని పొందడంలో సహాయం చేస్తుంది" అని అన్నారు.
 
దేశవ్యాప్తంగా 76 ప్రభుత్వ ఐటిఐ లు మరియు పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లతో హెచ్ఎంఐఎల్ భాగస్వామ్యంను కలిగి ఉంది. కార్యక్రమంలో భాగంగా, హెచ్ఎంఐఎల్ యొక్క సీఎస్ఆర్ విభాగం హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్), విద్యార్ధులు అవసరమైన వనరులు, నాణ్యమైన విద్య, అత్యాధునిక సాంకేతికతల పట్ల అవగాహనను పొందుతున్నారనే భరోసా అందజేసేలా ఇన్‌స్టిట్యూట్‌ల యొక్క వివిధ అవసరాలను తీర్చడం ద్వారా భాగస్వామ్య సౌకర్యాలను మెరుగుపరచడంలో పెట్టుబడి పెడుతుంది. అదనంగా, ఆటోమోటివ్ పరిశ్రమ, ఆటోమొబైల్ సాంకేతికతలో తాజా పురోగతులపై స్టడీ మెటీరియల్‌ని హెచ్ఎంఐఎల్ అందిస్తోంది, విద్యార్థులకు ఉద్యోగ శిక్షణతో పాటు, వారి నైపుణ్యాలను పెంపొందించడం మరియు అదనపు నైపుణ్యాలను అందించటం లక్ష్యంగా పెట్టుకుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నబిడ్డలకు భారంగా వుండకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ఎలాగంటే?