Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27-07-2024 శనివారం దినఫలాలు - నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా...

astro11

రామన్

, శనివారం, 27 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ బి|| సప్తమి రా.1.04 రేవతి సా.5.27 ఉ.వ.6.16 ల 7.45. ఉ.దు. 5.34 ల 7.17.
 
మేషం :- అనుకోని ఖర్చులు, ఇతరత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమైవుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి పొందుతాయి. ముఖ్యుల ఆరోగ్యం మిమ్మల్ని నిరాశపరుస్తుంది.
 
వృషభం :- చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా పూర్తి కాగలవు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. ఏ విషయంలోను తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. 
 
మిథునం :- స్త్రీలు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. మీ శ్రీమతి పోరుతో కొత్త యత్నాలు మొదలుపెడతారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
కర్కాటకం :- ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. ప్రముఖుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాల విషయంలో దాయాదుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
 
సింహం :- మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పెద్దలను ప్రముఖులను కలుస్తారు. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
కన్య :- రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. మీరు చేయబోయే మంచి పని విషయంలో ఆలస్యం చేయకండి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. గతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. క్రీడపట్ల ఆసక్తి చూపుతారు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి.
 
తుల :- మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి పనివారితో చికాకులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. విలువైన వస్తువులు ఏర్పరచుకోవాలనే స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. శ్రీవారు, శ్రీమతితోప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపన వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. 
 
ధనస్సు :- కీడు తలపెట్టె స్నేహానికి దూరంగా ఉండండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏదైనా అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడగలవు. ఊహించని ఖర్చులవల్ల అధిక ధనవ్యయం తప్పదు. మధ్య మధ్యవైద్యుల సలహా తప్పదు.
 
మకరం :- శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి.
 
కుంభం :- మీరు ప్రేమించే వారి వల్ల కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు.
 
మీనం :- ఉన్నతాధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-07-2024 శుక్రవారం దినఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి....