Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24-07-2024 బుధవారం దినఫలాలు - విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు...

Advertiesment
astro8

రామన్

, బుధవారం, 24 జులై 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ బ|| తదియ ఉ.10.42 శతభిషం రా.10.19 ఉ.వ.6.32 ల 8.02 తె.వ. 4. 18 ల ప. దు. 11.37 ల 12.30.
 
మేషం :- భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
 
వృషభం :- శ్రీవారు, శ్రీమతి విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారం అవుతాయి. బంధు మిత్రులకు సంబంధించిన సమాచారం అందుతుంది. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. 
 
మిథునం :- పెన్షన్, బీమా పనులు పూర్తవుతాయి. అదనపు ఆదాయమార్గాల కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభించగలదు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికివస్తారు. జన సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి వస్తుంది.
 
కర్కాటకం :- ఖర్చులు అధికమవుతాయి. ఒత్తిడి, నిరుత్సాహం ఎదుర్కొంటారు. తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. అంచనాలు ఫలించకపోవచ్చు. కోర్టు విషయాల్లో ప్రతికూలత తప్పకపోవచ్చు. దూరంలోవున్న వ్యక్తుల ఆరోగ్యం ఆవేదన కలిగిస్తుంది. మీ వ్యక్తిగత భావాలను గోప్యంగా ఉంచండి. 
 
సింహం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెళుకువ వహించండి. పెద్దల సహకారం లోపిస్తుంది. దైరకార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో ఆశించినంత ప్రయోజనాలు సాధించడం కష్టం. బంధువుల రాకపోకలుంటాయి. ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.
 
కన్య :- పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి. స్థిరాస్తి, క్రయ విక్రయాలకు అనుకూలం. స్టేషనరీ, ప్రింటింగు రంగాలలోవారికి అనుకూలం. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పండ్ల, పూల, పానీయ వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం.
 
తుల :- స్త్రీలు శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వాహనం నడుపుతున్నపుడు మెళుకువ వహించండి. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. రాబడికి మించిన ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికీ ముఖ్యుల సహకారం వల్ల సమసిపోతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. సోదరీసోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగాఉంటాయి. కంప్యూటర్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి గుర్తింపులభిస్తుంది. 
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మత్స్య, కోళ్ళ, గొజ్జెల వ్యాపారస్తులు మెళుకువ వహించండి. ఒక ప్రకటన మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు పురోభివృద్ధి. రావలసిన బకాయిలు సకాలంలో అందుతుంది. రాజకీయంలో వారికి కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు.
 
మకరం :- వస్త్ర రంగాలలో వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం అవుతున్నారని గమనించండి.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం.
 
మీనం :- శెనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ప్రైవేటు రంగంలోని వారు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. మీ చుట్టు ప్రక్కల వారితో సంభాషించేటప్పుడు మెళుకువ వహించండి. లిటిగేషన్ వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-07-2024 మంగళవారం రాశిఫలాలు - స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించాలి...