సీఎం రేవంత్ సర్కారులో మరోమారు కొలువుల జాతర!

ఠాగూర్
గురువారం, 29 ఆగస్టు 2024 (09:01 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరోమారు ఉద్యోగాల జాతర మొదలుకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూనియర్ కాలేజీల్లో సుమారుగా 2280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.వచ్చే యేడాది మార్చి మరకూ కళాశాలల్లో బోధనకు తాత్కాలిక నియామకాలు ఇంటర్ కమిషనరేట్ చేపట్టనుంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా పలు జూనియర్ కాలేజీల్లో 1654 గెస్ట్ లెక్చరర్స్, 449 మంది కాంట్రాక్టు, 96 పార్ట్‌టైమ్, 78 ఔట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే యేడాది మార్చి 31వ తేదీ వరకు కళాశాలల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 
 
వైకాపా షాకివ్వనున్న మోపిదేవి వెంకటరమణ?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైకాపా చిత్తుగా ఓడిపోయింది. వైకాపా బాపట్ల నియోజకవర్గం ఇన్‌‍చార్జిగా ఉన్న రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఇపుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఓ నిందితుడుగా ఉంటూ, కొన్ని నెలల పాటు జైలు జీవితం కూడా గడిపిన మోపిదేవి వెంకట రమణ ఇపుడు వైకాపా అధికారం కోల్పోవడంతో తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
వైకాపా అధికారంలో కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వీరిలో కొందరు రాజీనామా చేయగా, మరికొందరు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు వైకాపాకు టాటా చెప్పేశారు. ఇపుడు మోపిదేవి వెంకట రమణ వంతు వచ్చినట్టుంది. ఆయన త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా, నమ్మిన బంటుగా ఉన్న మోపిదేవి... పార్టీని వీడనున్నారనే వార్తలతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి. ఆయన త్వరలో టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా మోపిదేవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments