Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను మంచానికి కట్టేసి దుస్తులు విప్పి అక్కడ సిగరెట్‌తో కాల్చిన భార్య, ఆ తర్వాత?

ఐవీఆర్
బుధవారం, 8 మే 2024 (18:35 IST)
స్త్రీలపై హింసాత్మక చర్యలు, కేసులు చూస్తుంటాం. కానీ ఇక్కడ రివర్స్ కేసును చూసి పోలీసులు షాక్ తిన్నారు. మొదట్లో బాధితుడు వచ్చిన తన భార్య తనను హింసిస్తుందని చెబితే పోలీసులు దాన్ని లైట్ గా తీసుకున్నారు. దాంతో తన మాటలను పోలీసులు నమ్మడం లేదని, ఇంట్లో సీసీ కెమేరా పెట్టాడు. ఆ తర్వాత బాధితుడు ఆ వీడియోలో తన భార్య తనపై చేసిన దాడిని చూపించేసరికి పోలీసులు షాక్ తిన్నారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూరు ప్రాంతానికి చెందిన మన్నన్ జైన్- మెహర్ జైన్ దంపతులు. గత ఏడాది వీరి వివాహం అయ్యింది. ఐతే భార్యకు మద్యం, స్మోకింగ్ అలవాట్లు వున్నాయి. వీటిని అత్తారింటిలో చేస్తే ఒప్పుకోరని, భర్తను ఒత్తిడి చేసి ఇంటి నుంచి బైటకు వచ్చి వేరు కాపురం పెట్టింది. ఇక అప్పట్నుంచి మద్యం సేవిస్తూ భర్తపై భౌతిక దాడులు చేయడం మొదలుపెట్టింది. తనపై భార్య దాడి చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తుందని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు లైట్ తీసుకున్నారు. దీనితో ఇక లాభం లేదనుకుని తన బెడ్రూంలో సీసీ కెమేరా అమర్చాడు.
 
ఆ విషయం భార్యకు తెలియకుండా గోప్యంగా వుంచాడు. షరా మామూలుగా ఎప్పటిలానే భర్తను హింసించడం ప్రారంభించింది భార్య. భర్తకు మత్తు ఇచ్చి అతడి చేతులను మంచానికి కట్టేసింది. ఆ తర్వాత అతడి దుస్తులు తొలగించి అతడి పైకి ఎక్కి కూర్చుంది. సిగరెట్ వెలిగించి భర్త శరీరంపైన, వ్యక్తిగత ప్రదేశంపైనా కాల్చింది. చివరకి కత్తి తీసుకుని మర్మాంగాన్ని కోసేందుకు ప్రయత్నిస్తుండటంతో అతడు ఎలాగో తప్పించుకున్నాడు. ఆ తర్వాత తనపై భార్య చేసిన దాడి వీడియోను పోలీసులకు సమర్పించాడు. వీడియో చూసిన పోలీసులు షాక్ తిన్నారు. కేసు నమోదు చేసుకుని అతడి భార్యను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments