Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ వెళ్లాలి అనుమతి ఇవ్వండి : నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్

ఠాగూర్
బుధవారం, 8 మే 2024 (18:31 IST)
విదేశాలకు వెళ్లాలని ఉందని అందువల్ల తనకు అనుమతి ఇవ్వాలంటూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్, నాంపల్లిలోని సీబీఐ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల అభియోగాల కేసు నేపథ్యంలో సీఎం జగన్‌పై సీబీఐ దాదాపు 38 కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు బెయల్ షరతుల్లో పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో తాను విదేశాలకు వెళ్లేందుకు వీలుగా బెయిల్ నిబంధనలు సడలించాలని సీబీఐ కోర్టును కోరారు. సీఎం జగన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ఈ నెల 17వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ మధ్యన తాను విదేశాలకు వెళ్లాల్సి వుందని జగన్ తన పిటిషన్‌‍లో పేర్కొన్నారు. 
 
శరీర రంగుతో ప్రజలను అవమానిస్తే సహించం : ప్రధాని మోడీ వార్నింగ్ 
 
దేశ ప్రజలను శరీర రంగుతో అవమానిస్తే సహించబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈశాన్య రాష్ట్ర ప్రజలను చైనీయులతో దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో, ఉత్తరాది వారిని శ్వేత జాతీయులతో పోల్చారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోడీ సైతం స్పందించారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన 'జాతి వివక్ష వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని మండిపడ్డారు.
 
'కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉన్నా కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారు. ఎస్సీల విషయంలో ఆ పార్టీ వెనకడుగు వేసింది. దీనిపై నేనిచ్చిన వాగ్దానం నెరవేరుస్తా. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశాం. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక దళిత వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశాం. 
 
రెండోసారి వచ్చాక అదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఆ ఆదివాసీ బిడ్డను హస్తం పార్టీ వ్యతిరేకించింది. ఆమెను ఓడించాలని యత్నించింది. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని ఆ పార్టీ చూస్తోంది? చాలా మంది ప్రజల శరీరరంగు నలుపు ఉంటుంది. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి' అని మోడీ వ్యాఖ్యానించారు. 
 
దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన వేళ ప్రధాని ఈ విధంగా స్పందించారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని.. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తానెప్పటికీ సహించబోనని ప్రధాని హెచ్చరించారు. 
 
'కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి. ఆ పార్టీ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇండియా కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసగించింది. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోంది. అందులో ఒక భాగం హైదరాబాద్.. మరో భాగం ఢిల్లీకి వెళుతుందని ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని వదులుకోవడంతో ఆ హీరోలకు లక్క్ వరించింది

మట్కాలో వరుణ్ తేజ్ పై రామ టాకీస్ ర్యాంప్ సాంగ్ రిలీజ్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments