Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిరిజన మహిళపై 12 మంది గూండాల సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (11:07 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ గిరిజన మహిళపై 12 మంది గూడాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని పకూర్ జిల్లాలో వెలుగు చూసిన హేయమైన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులోని బాధిత మహిళ ఢిల్లీలో పని చేస్తుండటం గమనార్హం. ఆమె వారం క్రితంమే ఢిల్లీ నుంచి తన సొంతూరుకు వెళ్ళింది. గత ఆదివారం సాయంత్రం ప్రియుడితో కలిసి బైకుపై కూర్చొని అంపాడుకు వెళ్లింది. అక్కడ తన ప్రియుడు ఓ స్వీట్ షాపులో స్వీట్స్ కొనుగోలు చేసి, అక్కడ నుంచి ఓ ఫుట్‌‍బాల్ మైదానానికి వెళ్లారు. 
 
అక్కడ ఉన్న వున్న 12 మంది గూండాలు ఆ మహిళను నిర్బంధించి బలవంతంగా చెట్టుపక్కకు లాక్కెళ్లి వారంతా కలిసి అత్యాచారం చేసాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తర్వాత ప్రియుడు ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయాడు. మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు జిల్లా ఎస్డీపీఓ అజిత్ కుమార్ తెలిపారు. బాధితురాలిని ప్రాథమి ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments