జార్ఖండ్‌లో నుదుట బొట్టు పెట్టుకుని పాఠశాలకు వెళ్లిని విద్యార్థినిని టీచర్ కొట్టడం.. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగడంతో నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయాన్ని జాతీయ బాలల రక్షణ హక్కు కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటన జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి వెళ్లింది. ఇంకా బాధితురాలి కుటుంబాన్ని అధికారులు పరామర్శించారు. ఈ ఘటన ధన్‌బాద్ తేలుల్మారి అనే ప్రాంతంలో చోటుచేసుకుంది.
అంతకుముందు, రాజస్థాన్‌లోని కోటాలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కి సిద్ధమవుతున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ) కోట పరమజిత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటలోని మహావీర్ నగర్‌లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులకు సమాచారం అందింది.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, విద్యార్థి ఐఐటీ-జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడని అధికారి తెలిపారు.