Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఔటా..? నాటౌటా..? అంటూ అసహనం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ (video)

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (18:32 IST)
భారత్-వెస్టిండీస్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. భార‌త్ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ క్యాచ్ ఔట్ విష‌యంలో థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యంపై విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. 
 
డీఆర్ఎస్ టెక్నాల‌జీ, అంపైర్ నిర్ణ‌యం పట్ల క్రికెట‌ర్లు మరియు విశ్లేష‌కులు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. విండీస్ బౌలర్ కీమర్ రోచ్ విసిరిన బంతిని ఆడబోతుండగా బంతి రోహిత్ ప్యాడ్‌ను తాకి కీపర్ చేతిలో పడింది. విండీస్ అప్పీల్ చేయ‌గా అంపైర్ తిర‌స్క‌రించడంతో ఆ జట్టు రివ్యూ కోరింది. 
 
అయితే అంపైర్ దానిని థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయగా, ఔట్ అని సంకేతం వచ్చంది. అసలు బంతి, బ్యాట్‌కు మ‌ధ్య కొంత ఖాళీ ఉన్న‌ట్లు క్లియర్‌గా క‌న్పిస్తున్న‌ప్ప‌టికీ తనను ఔట్‌గా ప్ర‌క‌టించార‌ని రోహిత్ శ‌ర్మ అసంతృప్తి వ్య‌క్తం చేసాడు. 
 
తాను ఔట్ కాదంటూ నిరూపించుకోవడానికి రోహిత్ ఇవాళ తన ట్విట్టర్‌లో రీప్లే ఫోటోలను షేర్ చేసాడు. బంతి బ్యాట్‌కు తాకిన‌ట్లు స్ప‌ష్టంగా కనిపించలేదు. దీనిపై పూర్తి క్లారిటీ లేక‌పోయినా మూడో అంపైర్ ఔటివ్వ‌డం పట్ల అంతా అవాక్క‌య్యారు. దీంతో రోహిత్ శర్మ తీవ్ర నిరాశ‌గా మైదానం నుండి వెనుదిరిగాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments