Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్ ప్రపంచకప్ 2019: టీమిండియా విండీస్ వెన్ను విరిస్తే అంతేసంగతులు...

Advertiesment
క్రికెట్ ప్రపంచకప్ 2019: టీమిండియా విండీస్ వెన్ను విరిస్తే అంతేసంగతులు...
, గురువారం, 27 జూన్ 2019 (15:07 IST)
ప్రపంచ కప్‌ టోర్నీలో మాంచెస్టర్ వేదికగా భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత్ ఇప్పటివరకు ఐదు మ్యాచుల్లో ఆడాల్సి ఉండగా.. నాలుగు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. నాలుగింటిలోనూ భారత జట్టు గెలిచింది.

ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వెస్టిండీస్ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఐదు ఆడింది. నాలుగింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ గెలిచింది. వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దయింది.
 
పాయింట్ల పట్టికలో 9 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉండగా, 3 పాయింట్లతో వెస్టిండీస్ 8వ స్థానంలో ఉంది. వెస్టిండీస్‌కు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌‌లో ఓడిపోతే ఆ జట్టుకు సెమీ ఫైనల్‌కు చేరేందుకు దారులు మూసుకుపోతాయి. మరోవైపు, ఈ మ్యాచ్ గెలిస్తే కోహ్లీ సేనకు సెమీస్‌ అవకాశాలు మెరుగవుతాయి.
 
భారత్ రెండు మ్యాచ్‌లు గెలిస్తే..
భారత్ ఇప్పటి వరకు ఐదింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఇవాళ వెస్టిండీస్‌తో తలపడనుంది. తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడుతుంది. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఈ నాలుగు మ్యాచుల్లో కనీసం రెండింట గెలవాల్సి ఉంటుంది.
webdunia
 
ఇప్పటి వరకు భారత్ ఆడిన మ్యాచ్‌లు.. ఫలితాలు
జూన్ 5న దక్షిణాఫ్రికా Vs భారత్, 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది.
జూన్ 9న భారత్ Vs ఆస్ట్రేలియా, 36 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
జూన్ 13న భారత్ Vs న్యూజిలాండ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది.
జూన్ 16న భారత్ Vs పాకిస్థాన్, 89 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
జూన్ 22న భారత్ Vs అఫ్ఘానిస్తాన్, 11 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.
 
భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్‌ప్రిత్ బుమ్రా
 
వెస్టిండీస్ జట్టు: జేసన్‌ హోల్డర్‌ (కెప్టెన్) ఫాబియాన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, షనాన్‌ గాబ్రియేల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, ఎవిన్‌ లూయిస్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), ఆండ్రీ రసెల్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, షెల్డన్‌ కాట్రెల్‌, క్రిస్‌గేల్‌, షై హోప్‌, ఆష్లే నర్స్‌, కెమర్‌ రోక్‌, ఓషానె థామస్‌
 
వాన భయం లేనట్టేనా?
మాంచెస్టర్‌లో మంగళవారం వర్షం పడింది. భారత్, వెస్టిండీస్ తలపడనున్న తరుణంలో మళ్లీ వర్షం పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, వాతావరణ సూచనల ప్రకారం, గురువారం మాంచెస్టర్‌లో వాతావరణం పొడిగా ఉండేలా కనిపిస్తోంది. రోజంతా వర్షం కురిసే అవకాశాలు లేవు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.
 
జూన్ 13న భారత్, న్యూజీలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్... వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. దాంతో, రెండు జట్లకూ చెరో పాయింటు లభించింది.
 
క్రిస్ గేల్ రిటైర్మెంట్ వాయిదా.. ఇండియాతో సిరీస్ ఆడతానన్న వెస్టిండీస్ బ్యాట్స్‌మన్
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. ప్రపంచ కప్ టోర్నీ తర్వాత అంతర్జాతీయ వన్ డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నారు. అంతేకాదు.. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఆడటానికి కూడా సంసిద్ధత వ్యక్తంచేశారు. ఈ వెస్టిండీస్ ఓపెనర్ వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు. ఈ ప్రపంచ కప్ టోర్నీ తర్వాత అంతర్జాతీయ వన్-డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని ఫిబ్రవరిలో ప్రకటించారు.
webdunia
 
ఆయన వన్-డేలలో 10,345 పరుగులు చేశారు. అందులో 25 శతకాలు కూడా ఉన్నాయి. బ్రియాన్ లారా తర్వాత వెస్టిండీస్ తరఫున పది వేలకు పైగా వన్-డే పరుగులు చేసిన రెండో క్రికెటర్ గేల్. వన్ డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు గేల్ బుధవారం చెప్పారు. ఆగస్టులో ''ఇండియాతో జరిగే వన్-డే సిరీస్‌లో నేను తప్పకుండా ఆడతా. కానీ టీ20ల్లో మాత్రం ఆడను'' అని తెలిపారు. ఇండియాతో ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడవచ్చునని పేర్కొన్నారు. అలా ఆడితే ఐదేళ్ల కాలంలో గేల్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినట్లు అవుతుంది.
 
క్రిస్ గేల్ 2014 సెప్టెంబర్ నుంచి టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. రెండేళ్ల పాటు అంతర్జాతీయ వన్-డే క్రికెట్‌కు కూడా దూరంగా ఉండి.. 2017లో తిరిగివచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోబోలతో 2 కోట్ల ఉద్యోగాలు హుష్‌కాకి..