Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో పాకిస్థాన్‌కు అగ్రస్థానం... భారత్‌కు అట్టడుగు స్థానం

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (17:11 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ప్రధానంగా నాలుగు జట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానంలో ఉండగా, ఈ జట్లే సెమీస్‌కు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల తీరు తెన్నులను పరిశీలిస్తే, ముఖ్యంగా, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లను పట్టే విషయాన్ని పరిశీలిస్తే, పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిస్తే, భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. ఈ వివరాలను ఓసారి పరిశీలిద్ధాం.
 
క్యాచ్‌లను వదిలివేయడంలో పాకిస్థాన్ ఆటగాళ్లను మించిన ఆటగాళ్లు మరొకరు లేరని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ జట్టు ఆటగాళ్ళు ఇప్పటివరకు మొత్తం 14 క్యాచ్‌లను వదిలివేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జో రూట్ 9 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చాడు. దీన్ని పాకిస్థాన్ ఆటగాళ్లు జారవిడిచారు. ఫలితంగా జో రూట్ అలాంటి అవకాశం మరోమారు ఇవ్వకుండా ఏకంగా (107) సెంచరీ కొట్టాడు. 
 
కానీ, భారత్ మాత్రం ఇప్పటివరకు మొత్తం తాను ఆడిన మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క క్యాచ్‌ను జారవడిచి అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్ ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ (12), న్యూజిలాండ్ (9), సౌతాఫ్రికా (8), వెస్టిండీస్ (6), ఆస్ట్రేలియా (4), బంగ్లాదేశ్ (4), శ్రీలంక (3), ఆప్ఘనిస్థాన్ (2), భారత్ (1)లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments