Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరల్డ్ కప్ సెమీస్‌ రేస్ : ఆ నాలుగు జట్లు.. ఈ నాలుగేనా!

Advertiesment
వరల్డ్ కప్ సెమీస్‌ రేస్ : ఆ నాలుగు జట్లు.. ఈ నాలుగేనా!
, సోమవారం, 24 జూన్ 2019 (20:13 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా సగానికిపైగా మ్యాచ్‌లు ముగిసిపోయాయి. మరికొన్ని కీలక మ్యాచ్‌లు మిగిలివున్నాయి. అయితే ఇప్పటికే రెండు జట్లు సెమీస్ రేసు నుంచి తప్పుకున్నాయి. టైటిల్ వేటలో ఉన్న జట్లలో ఒకటైన సౌతాఫ్రికా లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. అలాగే, ఆప్ఘనిస్థాన్ జట్టు ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ ప్రపంచ కప్‌లో నాలుగు ప్రధాన జట్లూ సెమీస్‌కు చేరేలా ఉన్నాయి. వాటిలో ఒకటి న్యూజిలాండ్, రెండోది ఆస్ట్రేలియా, మూడోది భారత్, నాలుగో జట్టు ఇంగ్లండ్‌లు ఉన్నాయి. ఈ నాలుగు జట్లే సెమీస్‌లో తలపడేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల తీరు, ఆ జట్టు సాధించిన పాయింట్లను పరిశీలిస్తే, ఈ నాలుగు జట్లు మొదటి నాలుగు స్థానాలను ఆక్రమించివున్నాయి. 
 
న్యూజిలాండ్ జట్టు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ జట్టు ఖాతాలో మొత్తం 11 పాయింట్లు ఉన్నాయి. దీంతో పాయింట్ల పట్టికలో కివీస్ జట్టు అగ్రస్థానంలో ఉంది. అలాగే, ఆస్ట్రేలియా జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ జట్టులో మొత్తం 10 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు రెండో స్థానంలో ఉంది. 
 
ఇకపోతే, భారత్ ఇప్పటివరకు మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడగా, నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ జట్టు ఖాతాలో మొత్తం 9 పాయింట్లు ఉన్నాయి. ఇకపోతే, ఇంగ్లండ్ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌లు విజయం సాధించి, రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. దీంతో పాయింట్ల ఖాతాలో భారత్ మూడో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది. 
 
ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ నాలుగు జట్లలో ఏ ఒక్క జట్టుకు సెమీస్‌కు చేరే అవకాశాలు సంపూర్ణంగా లేవు. ఎందుకంటే, ఈ జట్లు పాయింట్ల పరంగానేకాకుండా, నెట్ రన్‌రేట్ పరంగా కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆదివారంతో ముగిసిన మ్యాచ్‌ల ప్రకారం శ్రీలంక ఖాతాలో 6 పాయింట్లు ఉండగా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఖాతాల్లో ఐదేసి చొప్పున పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్ ఖాతాలో కేవలం 3 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వెస్టిండీస్ కూడా సెమీస్ రేస్ నుంచి తప్పుకోనుంది. కానీ, పాకిస్థాన్ శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లలో ఏదేని అనూహ్య మార్పులు సంభవిస్తే మాత్రం సెమీస్‌కు చేరే అవకాశాలు ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోరిస్ బేకర్ ట్రోఫీల వేలం.. ఎందుకు?