జర్మనీ దేశానికి చెందిన ప్రఖ్యాత టెన్నిస్ లెజెండ్ బోరిస్ బెకర్ తన కెరీర్‌లో సాధించిన ట్రోఫీలను వేలం చేస్తున్నారు. ట్రోఫీలను వేలం వేయాల్సిన అవసరం ఆయనకు ఎందుకు వచ్చింది... అంతటి కష్టాలు ఏంటి అనే కదా మీ సందేహం. అప్పుల బారిన పడటంతో తన కెరీర్‌లో సాధించిన ట్రోఫీలను వేలం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచ టెన్నిస్ పటంలో బోరిస్ బెకర్‌కు ప్రత్యేక గుర్తింపువుంది. ఈయన తన 17 యేటనే తొలి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. అలా... తన టెన్నిస్ కెరీర్‌లో ట్రోఫీలతో పాటు అనేక మెడల్స్‌ను సాధించారు. ఇలా మొత్తం 83 ట్రోఫీలు, మెడల్స్‌ను గెలుచుకోగా, వాటన్నింటినీ వేలం వేయనున్నాడు.
ఈయన చేసిన అప్పులను చెల్లించేందుకుగాను బోరిస్ బెకర్ సాధించిన సావనీర్లు, ట్రోఫీలు, ఫోటోగ్రాఫ్స్, మెడల్స్ అన్నింటినీ బ్రిటీష్‌కు చెందిన వేల్స్ హార్డీ కంపెనీ వేలం వేయనుంది. ఈ వేలం పాటలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 11వ తేదీన ముగియనున్నాయి.
ముఖ్యంగా, వింబుల్డన్ విజేతగా నిలిచిన అతిపన్న వయస్కుడైన బెకర్... ఈయన తొలి మూడు టైటిల్స్‌ను తన 17వ యేటలో సాధించాడు. కాగా, బెకర్ తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను స్వీడన్ ఆటగాడు స్టీఫన్ ఎడ్బర్గ్‌ను ఓడించి 1990లో తొలిసారి కైవసం చేసుకున్నాడు. అలాగే, 1989లో యూఎస్ ఓపెన్ వెండి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.