Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ గ్లౌజ్‌పై ఐసీసీ నిషేధం.. షాకైన మహీ ఫ్యాన్స్.. (video)

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (13:10 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ధోనీ భారత ఆర్మీకి చెందిన ముద్రతో కూడిన గ్లౌజ్‌ను ధరించకూడదని.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షరతు విధించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ లీగ్ పోటీల్లో భాగంగా భారత్-దక్షిణాప్రికా జట్లు గత బుధవారం నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ధోనీ ధరించిన వికెట్ కీపింగ్ గ్లౌజ్‌లో భారత ఆర్మీకి చెందిన ''బాలిటన్ ముద్ర'' చోటుచేసుకుంది. దాన్ని చూసిన ఫ్యాన్స్ ధోనీపై ప్రశంసలు కురిపించారు. భారత ఆర్మీకి గొప్పతనాన్ని చాటాడని కొనియాడారు. 
 
ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ధోనీ భారత ఆర్మీలో ధోనీ పారాష్యూట్ విభాగంలో లెఫ్టినెంట్ కర్నల్‌ హోదాలో వున్నారు. అయితే ఐసీసీ, బీసీసీఐ క్రికెటర్లు ఎవరైనా సైనిక ముద్రలను వాడకూడదని నియమం వున్నట్లు తెలుస్తోంది. 
 
ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో.. ఎలాంటి అభిప్రాయాలను తెలియజేసే దుస్తులను ధరించకూడదు. అందుకే భారత ఆర్మీ సింబల్‌తో కూడిన ధోనీ గ్లౌజ్‌లపై నిషేధం విధించేందుకు ఐసీసీ సిద్ధమవుతుందని సమాచారం. దీంతో తదుపరి మ్యాచ్‌లో ధోనీ భారత ఆర్మీ గుర్తులు లేని గ్లౌజ్‌లు మాత్రమే ధరించాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments