Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా బౌలర్లకు ముచ్చెమటలు - ధవాన్ సెంచరీ... భారత్ భారీ స్కోరు

Webdunia
ఆదివారం, 9 జూన్ 2019 (19:00 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది.  
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్ల బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, శిఖర ధవాన్‌లు ఆరభంలో ఆచితూచి ఆడారు. ఆ తర్వాత బ్యాట్‌కు పని చెప్పారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్థసెంచరీలు సాధించారు. 
 
21.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది. రోహిత్ 70 బంతులు ఎదుర్కొని ఓ సిక్సర్, మూడు ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి, కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత కోహ్లీ సాయంతో ధవాన్ రెచ్చిపోయాడు. 95 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో సెంచరీ చేయగా, మొత్తం 109 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇది శిఖర్ ధవాన్‌కు మూడో ప్రపంచ కప్ సెంచరీ కావడం గమనార్హం. గతంలో సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లపై సెంచరీ బాదాడు. ధవాన్ వన్డే కెరీర్‌లో17వ సెంచరీ.  
 
అప్పటికి భారత్ స్కోరు 36.2 ఓవర్లలో 220 పరుగులు చేసింది. ధవాన్ ఔట్ కావడంతో నాలుగో డౌన్‌లో ప్యాండ్యాను బ్యాటింగ్‌కు పంపించారు. పాండ్యా బ్యాట్‌ను ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 27 బంతులు ఎదుర్కొన్న పాండ్య 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి తృటిలో అర్థ సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో భారత్ తన మూడో వికెట్‌ను 301 పరుగుల వద్ద కోల్పోయింది. 
 
ఆతర్వాత ధోనీ - కోహ్లీని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ధోనీ 14 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. ఫలితంగా మూడు బంతుల్లో ఓ సిక్సర్, ఓ ఫోర్ బాది 11 పరుగులు చేయగా, కోహ్లీ 77 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టి 82 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కోహ్లీ ఔట్ తర్వత క్రీజ్‌లోకి జాదవ్, రాహుల్‌లు నాటౌట్‌గా నిలించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు భారీ స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టోయిన్స్ రెండు వికెట్లు తీయగా, కుమ్మిన్స్, స్టార్క్, నైల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆస్ట్రేలియా ముంగిట 353 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments