Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ కప్ : కోహ్లీ వర్సెన్ స్మిత్... సండే ధమాకా

వరల్డ్ కప్ : కోహ్లీ వర్సెన్ స్మిత్... సండే ధమాకా
, ఆదివారం, 9 జూన్ 2019 (09:21 IST)
ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, భారత్ ఆడిన తన తొలి మ్యాచ్‌లో సఫారీ జట్టును చిత్తు చేసింది. ఆదివారం తన రెండో మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. 
 
మరోవైపు, గత ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ను ఓడించి టైటిల్‌ ఆశలను నీరుగార్చిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకునేందుకు కోహ్లీ సేన సిద్ధమైంది. ఈ యేడాది ఆసీస్‌, భారత్‌ ఎనిమిదిసార్లు తలపడితే 4-4తో సమానంగా ఉన్నాయి. ఇక ప్రపంచక్‌పల్లోనూ ఈ రెండు జట్లు ఢీకొన్న ప్రతీసారి అభిమానుల్లో ఆసక్తి రెట్టింపవుతుంది. 
 
భారత్‌.. 2011 ప్రపంచక్‌పలో ఆసీస్‌ వరుస విజయాలకు బ్రేక్‌వేస్తూ ఆ జట్టును క్వార్టర్స్‌లో ఓడించింది. ఆ తర్వాత సొంతగడ్డపై భారత్‌ను సమీస్‌లో ఖంగుతినిపించి ఆసీస్‌ బదులు తీర్చుకుంది. ఈసారి కూడా ఆసీస్‌ విజయాలతో మోతెక్కిస్తోంది. 
 
ఈ యేడాది మార్చిలో జరిగిన రాంచీ వన్డే తర్వాత ఆసీస్‌ వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా దూసుకెళుతోంది. ఈ తరుణంలో కంగారూలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది.
 
ఈ మ్యాచ్ జరిగే ఓవల్‌లో వాతావరణం ఆదివారం ఆకాశం మబ్బులు పట్టి ఉండే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం కాసేపు వర్షం పడొచ్చు. ఇక ఓవల్‌ పిచ్‌ మంచి పేస్‌, బౌన్స్‌కు అనుకూలంగా ఉండడంతో ఇరు జట్ల పేసర్లకు లాభించనుంది. భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు.
 
జట్లు (అంచనా)
భారత్‌: ధవన్‌, రోహిత్‌, కోహ్లీ (కెప్టెన్‌), రాహుల్‌, ధోనీ, జాదవ్‌/విజయ్‌ శంకర్‌, హార్దిక్‌, భువనేశ్వర్‌/షమి, కుల్దీప్‌, చాహల్‌, బుమ్రా.
 
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, ఖవాజా, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌, క్యారీ, కల్టర్‌ నైల్‌, కమిన్స్‌, స్టార్క్‌, జంపా.
 
మరోవైపు, ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు టాలీవుడ్ హీరో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లనున్నారు. తాను నటించిన 'మహర్షి' సూపర్ హిట్ కావడంతో, ప్రస్తుతం తన ఫ్యామిలీతో పలు దేశాల్లో పర్యటిస్తూ, ఎంజాయ్ చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం ఓవ‌ల్ మైదానంలో జరిగే ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌‌కి భార్యా, పిల్లలతో కలిసి హాజ‌రు కానున్నాడ‌ట‌. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇక స్టేడియంలో మహేశ్, భారత జట్టుకు మద్దతిస్తూ, ఎలా అల్లరి చేస్తాడో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ కప్ 2019... పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎక్కడుందో తెలుసా?