Webdunia - Bharat's app for daily news and videos

Install App

#INDvAUS: ఓవల్‌లో శిఖర్ ధవాన్ సెంచరీ.. పరుగుల వరద

Webdunia
ఆదివారం, 9 జూన్ 2019 (17:36 IST)
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా లండన్‍‌లోని ఓవల్ మైదానంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధవాన్.. 95 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో సెంచరీ (100) చేశాడు. ఇది శిఖర్ ధవాన్‌కు మూడో ప్రపంచ కప్ సెంచరీ కావడం గమనార్హం. గతంలో సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లపై సెంచరీ బాదాడు. ధవాన్ వన్డే కెరీర్‌లో17వ సెంచరీ. 
 
 అంతకుముందు మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అర్థ సెంచరీ చేశాడు. రోహిత్ 70 బంతులు ఎదుర్కొని ఓ సిక్సర్, మూడు ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి, కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. 
 
అప్పటికి భారత్ స్కోరు వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. రోహిత్ ఔటైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చి ఓపెనర్ శిఖర్ ధవాన్‌కు తన వంతు సహకారమిస్తూ బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ 32 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 33 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 190 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments