Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించలేదు : రవిశాస్త్రి

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (15:55 IST)
మహేంద్ర సింగ్ ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించకపోవడంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ముఖ్యంగా, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన సమయంలో ధోనీని ముందుగా బ్యాటింగ్‌కు దించకుండా ఏడో స్థానంలో దించడంపై పలువురు క్రికెటర్లు మండిపడుతున్నారు. 
 
దీనిపై కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ, ఎంతో అనుభవమున్న ధోనీ చివరి ఓవర్లలో క్రీజులో ఉండటం అవసరమని, ఇది సమిష్టి నిర్ణయమని చెప్పారు. 'ఇది టీమ్ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక ప్రతి ఒక్కరు ఉన్నారు. వాస్తవానికి ఇది చాలా చిన్న నిర్ణయం. ధోనీ ముందుగానే బ్యాటింగ్ కు వచ్చి, ఔటైపోతే... అది గెలిచే అవకాశాలను దారుణంగా దెబ్బ తీస్తుంది. అతని అనుభవం చివరి ఓవర్లలో చాలా కీలకం. క్రికెట్ చరిత్రలో అత్యున్నత ఫినిషర్ అయిన ధోనీని చివరి ఓవర్లలో ఆడించకపోవడం పెద్ద తప్పే అవుతుంది' అని చెప్పాడు.
 
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇదిలావుండగా, రవిశాస్త్రి కాంట్రాక్ట్‌ను బీసీసీఐ మరో 45 రోజుల పాటు పొడిగించింది. ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోహ్లీ, రవిశాస్త్రిలు బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జట్టు ఓటమిపై సమీక్షను నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments