Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : కోహ్లీ అర్థ శతకం... మందకొడిగా భారత బ్యాటింగ్ - 4 వికెట్లు డౌన్

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (17:20 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా గురువారం మాంచెష్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ వేదికగా భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
అయితే, ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు బరిలోకి దిగగా, రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 18 పరుగులకే ఔట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 29 రన్స్. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో అర్థ సెంచరీ కొట్టి క్రీజ్‌లో ఉన్నారు. 
 
ఇలా భారత బ్యాటింగ్ కోలుకుంటున్న సమయంలో కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 48 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 98. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విజయ్ శంకర్ కూడా 14 పరుగులు మాత్రమే చేసి జట్టు 126 పరుగుల వద్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 
 
మూడు వికెట్లలో రోచో రెండు వికెట్లు పడగొట్టగా, హోల్డర్ ఒక వికెట్ నేలకూల్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (51 నాటౌట్)తో కలిసి జాదవ్ (7) బ్యాటింగ్ చేస్తుండగా, రోచ్ బౌలింగ్‌లో జాదవ్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ తన నాలుగో వికెట్‌ను 29 ఓవర్ల వద్ద కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments