Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిణుకుమిణుకుమనే ఆశల పల్లకీలో పాకిస్థాన్!

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:28 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆరంభంలో చప్పగా సాగిన ఈ పోటీలు చివరి దశకు వచ్చే సమయానికి నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగుస్తున్నాయి. ముఖ్యంగా, భారత్ - ఆప్ఘనిస్థాన్, ఇంగ్లండ్ - బంగ్లాదేశ్, వెస్టిండీస్ - న్యూజిలాండ్, పాకిస్థాన్ - సౌతాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ నుంచి ఆప్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించారు. 
 
అలాగే, దాయాది దేశం పాకిస్థాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు గెలువగా, మూడు ఓటములు, ఒక డ్రాలు ఉన్నాయి. అంటే పాకిస్థాన్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం ఐదు పాయింట్లు ఉన్నాయి. అయితే, ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు గెలుపొందింది. దీంతో ప్రస్తుతానికి ఆ జట్టు సెమీస్ ఆశలు మిణుకుమిణుకుమంటూ సజీవంగా ఉంచుకుంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప పాక్ జట్టు కూడా సెమీస్‌కు చేరే అవకాశాలు దాదాపు లేనట్టే.
 
ఎందుకంటే, దక్షిణాఫ్రికా 7 మ్యాచ్‌లు ఆడి మూడు పాయింట్లతోనే ఉంది. ఆ జట్టు తానాడే మిగతా రెండు మ్యాచ్‌లూ గెలిచినా, 7 పాయింట్లకు మాత్రమే చేరుతుంది. ఇప్పటికే నాలుగు జట్లు 8 లేదా, అంతకన్నా ఎక్కువ పాయింట్లతో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. సో.. సఫారీలు సెమీస్ చేరే అవకాశాలు లేవు. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు, ఒక డ్రాతో 5 పాయింట్లతో ఉంది. ఆ జట్టుకు ఇంకో మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. మూడింట్లో గెలుస్తుందనుకున్నా 11 పాయింట్లకు చేరుతుంది. అది జరగడం అద్భుతమే.
 
అదేసమయంలో న్యూజిలాండ్ 11, ఆస్ట్రేలియా 10, ఇంగ్లండ్ 8 పాయింట్లతో ఉండగా ఈ జట్లూ మరో మూడేసి మ్యాచ్‌లు ఆడాల్సి వుంది. అలాగే, నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సివున్న భారత్ ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. మూడు మ్యాచ్‌లు ఆడే శ్రీలంక 6 పాయింట్లతో, బంగ్లాదేశ్ 5 పాయింట్లతో పాకిస్థాన్ కంటే ముందున్నాయి. మిగతా 3 మ్యాచ్‌లలో పాకిస్థాన్ కనీసం రెండు గెలుస్తుందని భావించినా, సెమీస్ చేరడం కష్టమే. ఏదేని అద్భుతాలు జరిగితే తప్పా... భారత్ లేదా ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి పాకిస్థాన్ సెమీస్ చేరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments