Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ : ఆస్ట్రేలియా బ్యాటింగ్

Webdunia
గురువారం, 11 జులై 2019 (15:04 IST)
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్లు తలపడుతుండగా, తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, ఆస్ట్రేలియా జట్టులో గాయపడిన ఉస్మాన్ ఖవాజా స్థానంలో హ్యాండ్స్ కోంబ్‌కు చోటు కల్పించారు. సొంతగడ్డపై జరుగుతున్నందున ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 
 
ఇంగ్లండ్ ఫామ్‌లో ఉన్న తీరు కూడా ఆ జట్టుపై భారీ అంచనాలు కలిగిస్తోంది. ఇక మేజర్ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా ఆటతీరు ఓ మెట్టుపైకి చేరుతుంది. కీలకమైన మ్యాచ్‌ల్లో చిన్న అవకాశం దొరికినా చాలు, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి ఉక్కిరిబిక్కిరి చేయడంలో ఆస్ట్రేలియా జట్టును మించిన జట్టు మరొకటి లేదని చెప్పొచ్చు. 
 
ఇరు జట్ల వివరాలు...
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోమ్ ఫించ్, స్మిత్, హ్యాండ్స్‌ కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టాయిన్స్, క్యారీ, కుమ్మిన్స్, స్ట్రాక్, లిన్, బెహ్రాండెఫ్. 
 
ఇంగ్లండ్ జట్టు... 
జానసీ బెయిర్‌స్టో, జాసన్ రాయ్, రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, క్రిస్ వోక్స్, లియామ్ ప్లుంకట్, అడిల్ రషీద్, జొఫ్రా అర్చెర్, మార్క్ వుడ్. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments