Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చిన్న పొరపాటు వల్లే భారత్ ఓడిందా?

Webdunia
గురువారం, 11 జులై 2019 (14:47 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ముంగిట వరకు వచ్చి చివరకు 18 రన్స్‌ తేడాతో ఓటమిపాలైంది. దీనిపై భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. భారత్ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. 
 
ముఖ్యంగా, టాపార్డర్ బ్యాట్స్‌మెన్లు కీలక మ్యాచ్‌లో విఫలం కావడం చాలా బాధ కలిగించిందన్నారు. అయితే, ధోనీ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించిందనీ, ధోనీతో కలిసి రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడారు. 
 
భారత్‌ను భారీ ఓటమి నుంచి తప్పించిన రవీంద్ర జడేజా, ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది జడేజా కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది. వీర్దిదరూ ఏడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయానికి బాటలు వేశారు. కానీ మ్యాచ్ ఆఖరులో ఒత్తిడికి లోనయ్యి వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది.
 
ఇదిలావుంటే, ధోనీ రనౌట్ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. అలాగే, ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా బదులు ఎం.ఎస్. ధోనీ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అలా వచ్చి ఉంటే ధోనీ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేసేవాడని.. అప్పుడు మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని, ఈ విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం చిన్న పొరపాటు జరిగిందని సచిన్ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments