Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్‌డౌన్... ఆస్ట్రేలియా క్రికెటర్ల పెళ్లిళ్లు వాయిదా

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:00 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి వైరస్ సోకకుండా ఉండేందుకు అనేక అంతర్జాతీయ ఈవెంట్స్ వాయిదా వేస్తున్నారు. టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలను సైతం వాయిదా వేసి, వచ్చే యేడాది నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. అలాగే, అనేక క్రికెట్ సిరీస్‌లు వాయిదాపడుతున్నాయి. 
 
అలాగే, అనేక మంది క్రికెటర్ల వివాహాలు కూడా వాయిదాపడ్డాయి. అలా ఆస్ట్రేలియాకు చెందిన మొత్తం ఎనిమిది మంది క్రికెటర్ల వివాహాలు వాయిదాపడ్డాయి. దీనికి కారణం కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలువుతోంది. దీంతో ఎనిమిది మంది క్రికెటర్లు తమ పెళ్ళిళ్లను వాయిదావేసుకున్నారు. 
 
ఆస్ట్రేలియా మీడియా కథనాల మేరకు.. క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన డి'ఆర్సీ షార్ట్, పేసర్ జాక్సన్ బర్డ్, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జాంపా, అన్‌కాప్డ్ మిచెల్ స్వెప్సన్, ఆండ్రూ టై, జెస్ జోనాసెన్, అలిస్టర్ మెక్‌డెర్మాట్ మరియు కాట్లిన్ ఫ్రైట్‌లు ఈ నెలలో తమ వివాహాలు చేసుకోవాలని భావించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. 
 
కానీ, కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళించింది. దీంతో అనేక ప్రపంచ దేశాల్లో లాక్‌డౌన్లు అమలు చేస్తున్నారు. ఈ కారణంగా వీరు తమ వివాహాలను నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. తదుపరి ఎప్పుడు అన్నదానిపై కూడా స్పష్టత లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments