Publish Date: Thu, 02 Apr 2020 (12:25 IST)
Updated Date: Thu, 02 Apr 2020 (12:27 IST)
ఆస్ట్రేలియా కరోనా వ్యాక్సిన్‌ను కనుగొంది. కామన్వెల్త్ దేశాల సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీసిరో) ఆస్ట్రేలియా అనుబంధ నేషనల్ సైన్స్ ఏజెన్సీ, కరోనా వైరస్ నివారణకు వాక్సిన్‌ను కనుగొని.. దాని టెస్టింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
ఈ వాక్సిన్ పరీక్షకు కనీసం మూడు నెలల కాలం పాటు సాగుతుందని.. వీటిని దేశంలోనే అత్యధిక భద్రత మధ్య ఉండే జీలాంగ్‌లోని ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లాబొరేటరీలోని బయో సెక్యూరిటీ కేంద్రంలో జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
కోయలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇన్నోవేషన్స్ (సీఈపీఐ)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా, కరోనా వాక్సిన్ పై పరీక్షలు చేసినట్టు సీసిరో పేర్కొంది. సీఈపీఐ, డబ్ల్యూహెచ్ఓలు ఇప్పటికే కరోనా వాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేసే అవకాశాలున్న పలు ఔషధాలను గుర్తించింది.
సెల్వి
Publish Date: Thu, 02 Apr 2020 (12:25 IST)
Updated Date: Thu, 02 Apr 2020 (12:27 IST)