''చికు'' పేరును ధోనీనే ఫేమస్ చేశాడు.. విరాట్ కోహ్లీ

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (12:55 IST)
రంజీ ట్రోఫీ ఆడే రోజుల్లో తనకు అక్కడి కోచ్ చికు అనే ముద్దుపేరు పెట్టారు. అప్పట్లో తనకు పెద్ద బుగ్గలు వుండువే.  2007లో జట్టు ఊడిపోతుంటే చిన్నగా హెయిర్‌కట్‌ చేయించుకున్నా. దీంతో తన బుగ్గలు, చెవులు పెద్దగా కనిపించేవని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. 2007లో జట్టు ఊడిపోతుంటే చిన్నగా హెయిర్‌కట్‌ చేయించుకున్నానని.. దాంతో తనకు ఆ పేరు వచ్చిందని కోహ్లీ పేర్కొన్నాడు.

అయితే, చికు అనే పేరును మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఫేమస్‌ చేశాడని చెప్పాడు. వికెట్ల వెనుక ఎక్కువసార్లు చికు అని పిలవడంతో స్టంప్స్‌మైక్‌లో వినపడి అది ఫేమస్‌ అయ్యిందని విరాట్‌ వెల్లడించాడు. ఇన్‌ స్టాగ్రామ్‌లో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌పీటర్సన్‌తో మాట్లాడిన కోహ్లీ తనకు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించాడు.

ఇకపోతే.. ప్రస్తుతం ధోనికి ఎన్నో నిక్ నేమ్స్ పెట్టుకుని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారనే సంగతి తెలిసిందే. మహి, ఎం ఎస్ ధోని, ఎంఎస్, మిస్టర్ కూల్ ఇలా చాలా పేర్లే ధోని అభిమానులు పిలుచుకునే జాబితాలో ఉన్నాయి. ఇక తాజాగా ఈ పేర్లలో మరో పేరు వచ్చి చేరింది. సిఎస్కే అభిమానులందరూ ప్రస్తుతం ధోని తలా అని ముద్దుగా పిలుచుకుంటారు.

తలా అంటే తమిళంలో అర్థం నాయకుడు అని. ఇక ఈ పేరు తనకు ఎంతో ప్రత్యేకమైనది అంటూ ధోని కూడా పలుమార్లు తెలిపాడు. తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా తనను తలా అని పిలుస్తారు అంటూ తెలిపాడు ధోని . తనకున్న నిక్ నేమ్స్‌లో ఈ పేరు ఎంతో ప్రత్యేకం అంటూ ధోనీ తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments