Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన ఆప్ఘన్.. డికాక్ అదుర్స్

Webdunia
శనివారం, 11 నవంబరు 2023 (10:00 IST)
Afganistan
ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఆప్ఘనిస్థాన్ నిష్క్రమించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ జట్టుపై గెలిచింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమితో ఆప్ఘన్ తట్టా బుట్టా సర్దేసింది. 
 
ఆఫ్ఘన్ జట్టు నిర్దేశించిన 245 పరుగుల విజయలక్ష్యాన్ని సఫారీలు 47.3 ఓవర్లలో ఛేదించారు. వాన్ డర్ డుసెన్ 76 పరుగులతో అజేయంగా నిలిచి దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు.  
 
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అత్యధిక డిస్మిసల్స్‌తో వరల్డ్ కప్ రికార్డును సమం చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు పట్టి... ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా), సర్ఫరాజ్ (పాకిస్థాన్)ల సరసన చేరాడు. 
 
కాగా,  శనివారం వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్, పాకిస్థాన్-ఇంగ్లండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారం టీమిండియా, నెదర్లాండ్స్‌తో ఆడనుంది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత  జట్టు నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తొలి సెమీఫైనల్లో తలపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

తర్వాతి కథనం
Show comments