Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వన్డే ప్రపంచ కప్ : 5 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు.. సెమీస్‌కు కివీస్!!

Advertiesment
kiwis
, గురువారం, 9 నవంబరు 2023 (20:43 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, గురువారం బెంగుళూరు వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు 5 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 23.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో పది పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు సెమీస్‌లోకి అడుగుపెట్టే తొలి నాలుగు జట్ల జాబితాలో కివీస్ ఉంది. అయితే, ఇతర జట్ల జయాపజయాలపై ఈ చిత్రం సెమీస్ ఆశలు ఆధారపడివున్నాయి. 
 
ఈ మ్యాచ్‍‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 23.2 ఓవర్లలోనే లక్ష్యానికి చేరుకుంది. కివీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు డెవాన్ కాన్వే 45, రచిన్ రవీంద్ర 42లు రాణించి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. 
 
ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ 14 పరుగులు చేసి విఫలమైనప్పటికీ మంచి ఫామ్‌లో ఉన్న డారిల్ మిచెల్ 46 పరుగులు చేశారు. మిగిలిన మ్యాచ్‌ను గ్లెన్ ఫిలిప్స్ 17, టామ్ లాథమ్ 2 పరుగులు చేసి పూర్తి చేశారు. శ్రీలంక బౌలర్లలో ఏజెంలో మ్యాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ ప్రస్తుతం 9 మ్యాచ్‌లు ఆడ 5 విజయాలతో 10 పాయింట్లు అందుకుంది. ఆ జట్టు సెమీస్ చేరాలంటే, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ఒకవేళ ఆ రెండు జట్లు గెలిస్తే రన్‌ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతానికి న్యూజిలాండ్ రన్‌ రేట్ 0.922 కాగా, పాకిస్థాన్ రేన్‌ రేట్ 0.036 ఆప్ఘనిస్థాన్ రన్ రేట్ 0.038గా ఉంది. 
 
పాయింట్ల పట్టికలో భారత్ మొత్తం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటగా, ఆ తర్వాత 12 పాయింట్లతో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పది పాయింట్లతో కివీస్ నాలుగో స్థానంలో ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ ప్రపంచ కప్ : నేడు శ్రీలంక వర్సెస్ కివీస్... దేవుడా... లంకేయుల చేతిలో కివీస్ ఓడిపోవాలి