Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖంగుతిన్న సఫారీలు.. వరుస విజయాలతోదూసుకెళుతున్న భారత్

indian players
, ఆదివారం, 5 నవంబరు 2023 (20:44 IST)
వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు చిత్తుగా ఓడిపోయింది. వరుసగా 8 మ్యాచుల్లోనూ విజయం సాధించి టాప్‌లోనే కొనసాగుతోంది. బలమైన దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 
 
తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 327/5 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ల దెబ్బకు ఏదశలోనూ సఫారీ జట్టు విజయం దిశగా సాగలేదు. రవీంద్ర జడేజా (5/33), షమీ (2/18), సిరాజ్ (1/11), కుల్‌దీప్‌ యాదవ్‌ (1/7) బౌలింగ్‌లో అదరగొట్టారు.
 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మరోసారి తన బలహీనతను బయటపెట్టుకుంది. ఈ వరల్డ్‌ కప్‌లో ఛేజింగ్‌ తమకు పెద్దగా కలిసి రావడం లేదని నిరూపించుకుంది. అద్భుత ఫామ్‌లో ఉన్న క్వింటన్‌ డికాక్‌ (5) ఈసారి విఫలం కావడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం పడింది. 
 
సిరాజ్‌ వికెట్ పతనం మొదలు పెట్టగా.. షమీ, జడ్డూ మిగతా బ్యాటర్ల పని పట్టారు. ఏడో స్థానంలో వచ్చిన మార్కో జాన్‌సెన్‌ (14) దక్షిణాఫ్రికా తరఫున టాప్‌ స్కోరర్ కావడం గమనార్హం. టెంబా బావుమా (11), వాండర్‌ డసెన్ (13), డేవిడ్ మిల్లర్‌ (11) మాత్రమే రెండకెల స్కోరు సాధించాడు.
 
Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్డే ప్రపంచ కప్ : సఫారీలతో పోరు.. భారత్ బ్యాటింగ్