Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ ప్రపంచ కప్ : వీరకొట్టుడు కొట్టిన కివీస్ బ్యాటర్లు.. పాకిస్థాన్ ముంగిట భారీ లక్ష్యం

icc world cup
, శనివారం, 4 నవంబరు 2023 (15:01 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శనివారం బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు వీరవిహారం చేశారు. ముఖ్యంగా, ఓపెనర్ రచిన్ రవీంద్ర సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ కేన్ విలయమ్సన్ మరో ఐదు పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు ఆరు వికెట్లన నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫలితంగా పాకిస్థాన్ ముంగిట 402 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 
 
పాకిస్థాన్ బౌలర్లను కివీస్ బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. కేన్ విలియమ్సన్ 79 బంతుల్లో రెండు సిక్స్‌లు పది ఫోర్ల సాయంతో 95 పరుగులు చేయగా ఓపెనర్ రచిన 94 బంతుల్లో ఒక సిక్సర్, 15 ఫోర్లను బాది 108 పరుగుు చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 35, మిచెల్ 29, చాంప్‌మన్ 39, గ్లెన్ ఫిలిప్స్ 41, మిచెల్ సాట్నర్26 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఓపెనర్లు తొలి వికెట్ భాగస్వామ్యంగా 68 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. పాకిస్థాన్ బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మహ్మద్ వాసిం మాత్రం 3 వికెట్లు తీయగా, హాసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, హరీస్ రవూఫ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియాకు భారీ షాక్ - ప్రపంచ కప్ నుంచి హార్దిక్ పటేల్ ఔట్!